-సెప్టెంబర్ 17న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు మాదిగ డప్పుల దండోరా.

-తెలంగాణ దండోరా పార్లమెంట్ ఇంచార్జి మంతటి గోపి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు 21(జనంసాక్షి):
ఎస్సీ రిజర్వేషన్ ల వర్గీకరణకు చట్టబద్ధ కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి ఇంటి ముందు వచ్చే నెల17న తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం, తెలంగాణ దండోరా,మహా ఎంఆర్పీస్ సంఘాల ఆధ్వర్యంలో మాదిగ డప్పుల దండోరాతో నిరసన తెలియజేస్తు న్నట్లు తెలంగాణ దండోరా నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జి మంతటి గోపి అన్నారు.ఆదివారం ఆయన నాగర్ కర్నూల్ తాలూకా అధ్యక్షుడు మంతటి భీమయ్య కొల్లాపూర్ తాలూకా అధ్యక్షుడు రాములు స్టూడెంట్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ పాదాల మధు శ్రీరాములు తో కలిసి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ డప్పుల దండోరా కార్యక్రమంలో
తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గడ్డ యాదయ్య మాదిగ, మహా ఎంఆర్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ముత్యపాగ నర్సిగ్ రావు మాదిగ, తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము పాల్గొంటారని తెలిపారు.ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎస్సీ వర్గీకరణ పై భారీ బహిరంగ సభ సమావేశాలలో కిషన్ రెడ్డి అనేక సభలలో మాట్లాడుతూ ఎస్సి వర్గీకరణను మేము అధికారంలోకి వచ్చాక పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడతామని మాదిగలను మోసం చేశారని అన్నారు.ఎంపీ గా ఉండి పార్లమెంట్లో మాట్లాడే స్థాయిలో ఉండి కూడా గతంలో కేంద్ర సహాయ మంత్రిగా ఉండి, ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడకపోవడం బాధాకరం అని అన్నారు.కాబట్టి దీనికి నిరసనగా కిషన్ రెడ్డి ఇంటి ముందు మాదిగ డప్పుల దండోరా నిర్వహిస్తున్నామని తెలిపారు.జిల్లాలోని మాదిగలు అందరు తప్పకుండా సెప్టెంబర్ 17న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు జరిగే మాదిగ డప్పుల దండోరా లో పాల్గొని అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.