: సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహమే. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడ. గంగారం. ఎస్ డి ఎల్ సి కమిటీ కార్యదర్శి పుల్లన్న
గంగారం సెప్టెంబర్ 15 (జనం సాక్షి)
1948 సెప్టెంబర్ 17న జరిగింది
విలీనమ. లేక విమోచన. లేక విద్రోహమ. అంటూ ప్రతి ఏడాది చర్చ జరుగుతూనే ఉంది. ఈసారి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ భౌతిక పరిస్థితుల దృష్ట్యా మరింత తీవ్రతను సంతరించుకుంది.
తెలంగాణ. కర్ణాటక. మహారాష్ట్రకు చెందిన. 16 జిల్లాలతో నిజాం సంస్థానం ఉండేది. దీనిని నైజాం సంస్థానం హైదరాబాద్ సంస్థానం అంటారు. దీనిని మీరు ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలించేవాడు. ఆయన పాలనలో సంస్థాన ప్రజలు ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా అణగదొక్కబడి కష్టాలు బాధలతో జీవించారు.
ఈ క్రమంలోనే తమ బాధలతో నిజాం. వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ పేరుతో కమ్యూనిస్టులు ఉద్యమించారు
ఆ ఉద్యమాలను సహించలేని నిజాం రజాకార్ సైన్యం తీవ్ర నిర్బంధకాండను ప్రయోగించి గ్రామాలపై పడి స్త్రీలను అత్యాచారాలు చేస్తూ ఉద్యమిస్తున్న నాయకులపై దాడులు చేస్తూ హత్యలు చేయడం. జరిగేవి అప్పుడు ప్రజలు నిజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేస్తూ 3000 గ్రామాల్లో 10 లక్షల ఎకరాల భూమిని ప్రజలు సాధించుకోగలిగారు. ఈ పోరాటంలో 4,000 మంది ప్రజలు అమరత్వం చెందడం జరిగింది.ఈ తిరుగుబాటుకు భయపడ్డా నిజం నవాబు. లోపాయ కారు ఒప్పందం చేసుకొని 1948 సెప్టెంబర్ 13న.గ్రామాలపై సైన్యాన్ని ఉసిగొలిపి. సైన్యం నాలుగు రోజుల రోజుల్లోనే అనగా సెప్టెంబర్ 17 న యూనియన్ ప్రభుత్వం లో నిజాం సంస్థానాన్ని కలుపుకుంది. వీరోచిత సాయిధరైతంగా పోరాటంతో ప్రజలు సాధించుకున్న హక్కులను.భూములను. కోల్పోయిన రోజు విమోచన ఎలా అవుతుంది. విలీనం అసలే కాదు. సెప్టెంబర్ 17న జరిగింది ముమ్మాటికి విద్రోహమే ఈ విద్రోహ దినాన్ని గ్రామ గ్రామాన జరుపుకోవాలనే ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు సాంబరాజు. జీవన్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area
|