సెమీస్‌లో సైనా VS సింధు..??
భారత స్టార్ షెట్లర్ సైనా నెహ్వాల్ హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేసింది. కాగా గరువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రి-క్వార్టర్స్ ఫైనల్లో అయిదవ సీడ్ సైనా నెహ్వాల్ 18-21,21-9,21-16 తేడాతో పద కొండవ ర్యాంకర్‌గా సయాకా శాటో(జపాన్)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరింది.కాగా తొలి గేమ్‌ల పోరాడి ఓడిన సైనా రెండవ గేమ్‌లో మాత్రం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.ఆ గేమ్‌లో పెద్దగా తప్పిదాలకు ఆస్కారం ఇవ్వని సైనా 21-9తో గెలిచింది.ఆ తరువాత నిర్ణయాత్మక మూడవ గేమ్‌లో నయాకా నుంచి సైనాకు ప్రతిఘటన ఎదురైంది.కాగా తన అనుభవాన్ని ఉపయోగించిన సైనా ఎట్టకేలకు సయాకను వెనక్కి నెట్టి విజయాన్ని సొంతంచేసుకుంది. రియో ఒలింపిక్స్ తరువాత గాయంనుంచి కోలు కున్న సైనాకు ఇది రెండవ విజయం. కాగా సెమీస్‌లో సైనా, సింధులు ఒకరినొరకు ఢీకొనే అవకాశం ఉంది. బిడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ మాస్టర్స్‌పై కన్నేసిన వీరిద్దరూ టాప్ -8లో ఉంటేనే ఆడగలరు.