సేంద్రియ వ్యవసాయంతో మేలు

ఆదిలాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): సాధారణ పంటలు పండించేందుకు జైకా నిధులతో చెరువులను అభివృద్ధి చేస్తామని నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధిశాఖ అధికారులు చెప్పారు. వివిధ రకాల పంటలు పండించడంలో ఆయకట్టు రైతులకు అవగాహన కల్పించేందుకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని  అన్నారు. రైతులు పత్తి పంట కాకుండా అంతర పంటలను సాగు చేయాలన్నారు. వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఒక పంట నష్టం జరిగినా మిగతా పంటలో లాభం చేకూరుతుందని అన్నారు. పంట మార్పిడి చేయాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా భూసారం పెరుగుతుందని ఖర్చు తక్కువగా ఉంటుందన్నారు. ఆత్మ ద్వారా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి కావాల్సిన పనిముట్లు, పరికరాలు అందజేస్తామని సూచించారు.
ఆధునిక పద్ధతులు ఉపయోగించి వ్యవసాయం చేస్తే పంటలో నష్టాలుండవని పేర్కొన్నారు.