సేంద్రియ వ్యవసాయంపై పెద్ద ఎత్తున ప్రచారం

ప్రోత్సాహంతోనే రైతులకు మేలు

హైదరాబాద్‌,జూలై27(జ‌నంసాక్షి): దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణలో వ్యవసాయం జూదంగా మారింది. ఏ పంట వేసినా ఫలితం కానరాని దుర్భర పరిస్థితులు దాపురించాయి. మార్కెట్‌ ధరలను చూసి ఆయా పంటలు వేసి రైతులు చేతులు కాల్చుకుంటున్నారు. ఇందుకు కంది,మిర్చి,ఉల్లి, పసుపు పండించిన రైతుల దీనగాధలే నిదర్శనం. పంటమార్పిళ్లు, సేంద్రియ వ్యవసాయంపై ప్రోత్సాహం పెరగాలి. దక్కన్‌ డెవలప్‌మెంట్‌ చేస్తున్న కృషి వల్ల ఎందరో రైతుల జీవితాలు మారాయి. అలాంటి సంస్థలను ప్రోత్సహించి వ్యవసాయ విధానంలో మార్పులు తేవాలి. నిజానికి దేశంలో రైతులకు ఎంత చేసినా తక్కువే. తమ చెమటోడ్చి మనకు అన్ని విధాలుగా భోజనం పెడుతున్న అన్నదాతకు అగ్రతాంబూలం ఇవ్వాలి. ఆ విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలి. పంటలు పండక ఆశలుడిగిన రైతులు చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇంచుమించుగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి దుర్భర పరిస్థితులే తాండవిస్తున్నాయి. అందుకే రైతులను ఆదుకునేందుకు ఏ చిన్న పని చేపట్టినా అది పెద్దగానే కనిపిస్తుంది. ఉచిత విద్యుత్‌, రుణమాఫీ లాంటి పథకాలు కూడా వారి జీవితాలను మార్చలేక పోతున్నాయి. ఈ దశలో తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా సిఎం కెసిఆర్‌ భగీరథ యత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా అనేక ప్రాజెక్టులను చేపట్టారు. మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్దరణ చేపట్టారు. తాజాగా ఎరువుల కోసం ఒక్కో రైతుకు నాలుగువేలు అందచేసారు. నిజంగా ఇదో సాహసోపేత చర్యగానే గుర్తించాలి. ఎందుకంటే రైతులు చితికి పోతున్న తరుణంలో వారికి ఏ రకమైన సాయం చేసినా అది నదిలో కొట్టుకుపోతున్న వారికి ఆసరాగా లభించిన గడ్డిపోచలాంటిది. ఏ రకంగా చేస్తే వారిని ఆదుకోగలమో సిఎం కెసిఆర్‌ మాత్రమే అర్థం చేసుకోగలరు. తెలంగాణలో రైతుల స్థితిగతులను మార్చటానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి దేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా రూ.16 వేల కోట్లకుపైగా పంటరుణాలను మాఫీ చేసింది. సాగులో అత్యాధునిక పద్ధతులను ప్రోత్సహించటానికి భారీ సబ్సిడీ విూద యంత్ర పరికరాలను అందజేస్తున్నది. నకిలీ విత్తన కంపెనీలపై ఉక్కుపాదం మోపుతున్నది. రైతులకు 9 గంటల స్థానంలో నిరంతరంగా కరెంటును సరఫరా చేస్తున్నది. తాజాగా బీమా పథకాన్ని అమలు చేయబోతున్నది. అయితే పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చే వరకు, వారు మాత్రమే ధరలు నిర్ణయించుకునే దశ వచ్చే వరకు పరిస్థితుల్లో మార్పు రాదు. నాణ్యతా ప్రమాణాలతో పండించి ఎగుమతులకు అనగుఉణంగా పంటల విధానాల్లో మార్పులు వస్తేనే వ్వయసాయం బాగుపడగలదు. అలాగే వ్వయసాయాధిరత పరిశ్రమల స్థపనను ప్రోత్సహించాలి. అప్పుడే పంటలకు ధరలు దక్కుతాయి.