సేంద్రియ సాగుకు ప్రోత్సాహం

సంగారెడ్డి,జనవరి25(జ‌నంసాక్షి): సేంద్రియ సాగుకు ముందుకు వచ్చే వారికి అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పేర్కొన్నారు. పర్యావారణపరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యరక్షణకు ఇది ఎంతో ముఖ్యమని అన్నారు. రైతులు ఈ రకమైన సాగుకు మళ్లీ అలవాటు పడాలన్నారు. సేంద్రియ ఎరువుల తయారు శ్రమతో కూడుకున్నప్పటికీ మహిళలు ఓర్పుతో కృషిచేయడం, ఇందుకు అవసరమన్నారు. ప్రభుత్వం కూడా ఈ తరహా వ్వయసాయానికి ఆర్థికచేయూతను ఇస్తోందన్నారు. చిరుధాన్యాలను కాపాడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడే సేంద్రియ సాగుకు డక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ సంస్థ చేస్తున్న కృషి గొప్పదని అన్నారు. వారి పిలుపును అందుకుని రైతులంతా సేంద్రియ సాగుకు ముందుకు రావాలని అన్నారు. జహీరాబాద్‌ లో జరిగిన పాతపంటల జాతరలాంటివి జిల్లాలో అనేక చోట్ల జరగాలని,రైతులను చైతన్యం చేయాలన్నారు. 18 ఏళ్లుగా నిర్వహిస్తున్న పాతపంటల జాతర ఎందరో రైతులను చైతన్యవంతులను చేసిందన్నారు. ముఖ్యంగా సంస్కత్రి, సంప్రదాయాలను గుర్తుకు తీసుకొస్తుందన్నారు. సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు, పోషక విలువలున్న చిరుధాన్యాల వంటకాలతో ¬టల్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు.చిరుధాన్యాల ఆహారం ఆరోగ్యానికి శ్రేయస్కారమన్నారు.