సైదాపురంలో గణనాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కల్లూరి రామన్న.
యాదగిరి గుట్ట. జనం సాక్షి
ఈరోజు యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో గంగాధర యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత భక్తి భావాన్ని పెంపొందించు కోవడం అభినంద నీయమని కొని యాడారు ఈ సంధర్బంగా గంగాధర యూత్ సభ్యులు కల్లూరి రాంచంద్రా రెడ్డి ని శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోల్ల కొండల్ రెడ్డి,తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్,యాదగిరిగుట్ట మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాటూరి బాలయ్య గౌడ్,జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కల్వకొలను సతీష్ భట్, జిల్లా కాంగ్రెస్ నాయకులు బిక్షాల యెల్లస్వామి,మాసాయిపేట కాంగ్రెస్ నాయకులు వెంకటేష్, యువజన కాంగ్రెస్ నాయకుడు మైలారం స్వామి, మరియు గంగాధర యూత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, బాలకిరణ్, మారపాక బాబు,వినాయక కమిటీ అధ్యక్షడు పూలేపాక మల్లేష్,వినాయక కమిటీ సభ్యులు, మారపాక నవీన్, పూలేపాక వినయ్, కన్నాయి అరవింద్, కన్నయి బాబు, పూలేపాక నవీన్, మోత్కుపల్లి సురేష్, మోత్కుపల్లి కరుణాకర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.