సైన్స్ ఎక్స్‌ప్రెస్‌ను తిలకించేందుకు భారీగా వచ్చిన విద్యార్థులు
వరంగల్: ఖాజీపే రైల్వేస్టేషన్లో మూడో రోజు కొనసాగుతున్న జీవవైవిధ్య సైన్స్ ఎక్స్‌ప్రెస్ ప్రదర్శన తిలకించేందుకు విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. విద్యార్థులతో స్టేషన్ ఆవరణ కిటకిటలాడింది. ప్రదర్శన తిలకించడానికి వచ్చిన విద్యార్థులు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు, భారీ సంఖ్యలో విద్యార్థులు రావడంతో స్వల్ప తోపులాట జరిగింది, విద్యార్థులు తాకిడి దృష్య్టా ఈ ప్రదర్శనను పొడగించినట్లు నిర్వహకులు తెలియజేశారు.