సైబరాబాద్ కమిషనరేట్‌లో జెండా ఎగురేసిన స్వామిగౌడ్
హైదరాబాద్,ఆగస్ట్15(జనం సాక్షి):72 వ స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సైబరాబాద్ పోలిస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన స్వాతంత్య దినోత్సవ వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండలి చైర్మైన్ స్వామి గౌడ్ పాల్గొని త్రీవర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా స్వావిూ గౌడ్ మాట్లాడుతూ స్వాత్రంత్య్ర ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు నివాళులు అర్పించారు. తమ సర్వస్వం దేశం కోసం త్యాగం చేసి నిస్వార్ధంగా దేశం స్వాతంత్యం కోసం లాటీలు తూటాలను ఎదిరించిన ఎందరో మహానుబావులకు వందనాలు అని అన్నారు. రంగారెడ్డి జిల్లా ఏర్పడి 40 సంవత్సరాలు పూర్తి చేసుకునందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు జీవిత భీమా పథకం, కంటి వెలుగు కార్యక్రమలు చేపట్టడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్, చేపల పంపిణి ,జర్నలిస్టు ల సంక్షేమం, గిరిజన బిసిల మైనారిటీ, సంక్షేమం హరిత హరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇంకా అనేక కార్యక్రమలు చేపట్టడం జరిగిందన్నారు. బంగారు తెలంగాణ దిశగా ప్రయాణిస్తుందని ఆయన అన్నారు. పోలిస్ ల విన్యాసాల విద్యార్థుల దేశ భక్తి గేయాలఆటపాటలతో అట్టహాసంగా స్వాతంత్య దినోత్సవం ఘణంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరు రఘునందన్ రావు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తో పాటు పలు శాఖల ఉన్నాతాధికారులతో పాటు వివిధ విద్యార్థి, విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు.



