సైబరాబాద్‌ పరిధిలో 15 వరకూ మద్యం దుకాణాల బంద్‌

హైదరాబాద్‌ : సైబరాబాద్‌ పరిధిలో నేటి నుంచి ఈనెల 15వ తేదీ ఉదయం వరకూ మద్యం దుకాణాలు మూసివేయాలని కమిషనర్‌ సీవీ అనంద్‌ అదేశాలు జారీ చేశారు. సైబరాబాద్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధాజ్ఞలు విధించినట్లు కమిషనర్‌ వివరించారు.