సైబరాబాద్‌ సీపీగా బాధ్యతలు చేపట్టిన ఆనంద్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ట్రాఫిక్‌ బాస్‌గా నగర ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించేందుకు విశేష కృషి చేసిన ఆయనకు పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. శాంతి భద్రతలు, స్పెషల్‌బ్రాంచ్‌, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌, ట్రిఫిక్‌, స్పెషల్‌ ఆపరేషన్‌ టీం, సైబర్‌క్రైమ్‌, సీసీఎస్‌లతో పాటు పరిపాలన విభాగాలు ఆనంద్‌ కనుసన్నల్లోనే పనిచేయాల్సి ఉంటుంది.
విస్తీర్ణంలో సైబర్‌బాద్‌ కమిషనరేట్‌ అతిపెద్దదైనా ఠాణాల సంఖ్య తక్కువే. కమిషనర్గఆ బాధ్యతలు స్వీకరించిన ఆయన ముందుగా కొత్త ఠాణలాలు ట్రాఫిక్‌ బడ్జెట్‌, ఉగ్రవాదంపై దృష్టి పెట్టడంతో పాటు సైబరాబాద్‌లో పెండింగ్‌లో ఉన్న సంచలనం రేపిన పలు దోపీడీలు, హత్యలు, కిడ్నాప్‌ కేసులను ఛేధించాల్సి ఉంది.