సైబర్ నేరాలపై అవగాహన
ఖిలావరంగల్ మండలం, జనంసాక్షి:
ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ లో 1996 సం,లో స్థాపించబడింది, సంస్థ స్థాపకురాలు పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సునీత కృష్ణన్ మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి దివ్య దేవరజన్ అధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమా లను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో ఎక్కువగా బాలబాలికలు, మహిళలు ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, సినిమాలో చాన్స్ అనే అవకాశాల పేరుతో మాయమాటలు చెప్పి మోసం చేసి శ్రమ దోపిడీ, అవయవాల మార్పిడి లైంగిక దోపిడీకి గురిచేశారు. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండడానికి ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ తెలంగాణాలో అన్ని జిల్లాలలో అవగాహన కార్యక్రమలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే ఈ సంస్థ తెలంగాణా పోలీస్, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారుల సహాయంతో ఇప్పటి వరకు ఇలా మోసపోయిన 26 వేల 500ల మంది అమ్మాయిలను, మహిళ లను కాపాడారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ప్రోగ్రాం సీని యర్ కోఆర్డినేటర్ వై. చంద్రయ్య అసిస్టెంట్ కో-ఆర్డినేటర్ ఎండీ. రఫీ బి. సంధ్య ఈ శిక్షణను ప్రాథమిక వ్యవసాయ | సహకార సంఘం హల్ అరెపల్లి గ్రామం వరంగల్ జిల్లాలో అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో విశ్వజ, సూపర్వై జర్స్, రమాదేవి, భగ్యమ్మ, ఛాయాదేవి, వెంకటేశ్వరి అలాగే వివిధ గ్రామాల నుండి అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.