సైబర్ నేరాలపై రేపు వరంగల్ పోలీస్ కమిషనర్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం

ఖిలా వరంగల్ మండలం,జనంసాక్షి(అక్టోబర్20):-
జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంలో భాగంగా ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు, సైబర్ నేరగాళ్ళ చేతుల్లో మోసపోయిన బాధితులకు ఏవిధమైన సహకారం అందించడం జరుగుతోంది. సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ విభాగం తీసుకుంటున్న చర్యలపై ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసేందుకుగాను రేపు అనగా 21-10-22, శుక్రవారం రోజున వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా ప్రజలకు అందుబాటులో వుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు సైబర్ నేరాలపై ప్రజలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు వరంగల్ పోలీస్ కమిషనర్ సమాధానమిస్తారు. కావున ప్రజలు కేవలం సైబర్ నేరాల అనుబంధంగా వున్న అనుమానాలకు సమాధానాలు తెలుసుకోనేందుగాను రేపు మధ్యాహ్నం 3గంటల నుండి 4గంటల వరకు 9491089141 మరియు 9440904685 నంబర్లకు ఫోన్ చేయగలరు