సైబర్ నేరాలు,సామాజిక మాధ్యమాల వినియోగంపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. ఎసై మచ్చెంధర్ రెడ్డి
కోటగిరి అక్టోబర్ 18 జనం సాక్షి:- కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ కోటగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో మంగళ వారం రోజున బోధన్ డివిజన్ సైబర్ క్రైమ్ బృందం,పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్లైన్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ అవగాహ న సదస్సులకు ముఖ్య అతిథిగా స్థానిక ఎసై మచ్చేంధర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.విద్యార్థి దశ నుండే ప్రతీ ఒక్కరు విద్యాభ్యాసంలో కొత్తవిషయలను నేర్చుకుంటూ సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.నేటి సమాజంలో ఆన్లైన్ మోసాలు విపరీతంగా కొనసాగు తున్న తరుణంలో ప్రతి ఒక్కరు ఈ ఆన్లైన్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండి తోటి వారికి అవర్నెస్ కల్పించాలన్నారు.తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సైబర్ అంబాసి టర్లతో,ఈ నేలను సైబర్ నేరాలపై సొసైటీలో పలు వురికి ఆన్లైన్ మోసాల పట్ల అవర్నేస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నమన్నారు.కరోనా మహమ్మారి దెబ్బకు నేడు పూర్తి స్థాయిలో విద్యా రంగం డిజిటల్ రూపం దాల్చడంతో ఉపాధ్యాయులు ,విద్యార్థులు సెల్ఫోన్,కంప్యూటర్ ద్వారా ఆన్లైన్ క్లాసుల నిర్వహణ కొనసాగుతుంద న్నారు.ఈ డిజిటలైజేషన్ రంగంలో మంచితో పాటు చెడు కూడా ఉంది.తద్వారా ప్రతి ఒక్కరు అనవసర లింకులను ఓపెన్ చేయవద్దు.ఎక్కువ సమయం ఫోన్ చూడటం వల్ల కంటి సమస్యలకు గురికా వాల్సి వస్తుందన్నారు.ఫోన్లను ఎప్పటి కప్పుడు అప్డేట్ చేస్తు,సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు భాద్యతగ మెలగాలన్నారు.వాట్సప్ హ్యాకింగ్ విషయమై ప్రతి ఒకరు జాగ్రత్తగా ఉండాలన్నారు.
వాట్సప్ సెట్టింగ్లో టు స్టెప్ వెరిఫి కేశన్ ప్రతి ఒక్కరు చేసుకోవాలన్నారు.అనవసరంగ క్యూఆ ర్సి కోడ్ను స్క్యానింగ్ చేయవద్దన్నారు.18 నుండి 28 సం.ల వారు అతివేగం,ట్రిబుల్ రైడింగ్ చేయరాదన్నా రు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత రాష్ట్రంలో షీ టీమ్స్ ప్రత్యేక వింగ్ ఏర్పాటై నేడు ఉమెన్స్ రక్షణ,భద్రత విషయమై క్రియాశీలకంగా పనిచేస్తుందన్నారు.అందులో భాగంగా బుధవారం రోజున కోటగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎసిపి ఆధ్వర్యంలో షీ టీమ్ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ అవగాహన సదస్సులో కోటగిరి టౌన్ విద్యార్థులు ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాటశాల ప్రిన్సిపల్ నజీముద్దిన్,షి టీమ్స్ బోధన్ డివిజన్ ఇంచార్జీ ఎసై విఠల్, సైబర్ క్రైమ్,షి టీమ్ ఉపాధ్యాయులు,పోలీస్ సిబ్బంది,పాఠశాల సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.