సైబర్ బాధితులు సహాయక నెంబర్లను ఆశ్రయించాలి.

 

 

 

 

 

 

 

 

సైబర్ మోసాలను నివారించేందుకు పోలీసు శాఖ ఎన్నో చర్యలు తీసుకుంటుంది.
జిల్లా అదనపు ఎస్పీ సిహెచ్ రామేశ్వర్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్20 (జనంసాక్షి):
సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ మోసాలను నివారించేందుకు పోలీసు శాఖ ఎన్నో చర్యలు తీసుకుంటున్నా బాధితుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుందని జిల్లా అదనపు ఎస్పీ సిహెచ్ రామేశ్వర్ తెలిపారు.గురువారం సైబర్ అవగాహన నెలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన లైవ్ వేబినర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను సైబర్ నేరాలు ప్రథమంగా ఉందని సోషల్ మీడియా ద్వారా ట్విట్టర్ ఫేస్ బుక్,వాట్సాప్ లలో మనకు తెలియకుండానే మన రాష్ట్ర సమాచారాన్ని ఫోన్ హ్యాక్ చేసి ఆర్థికంగా మానసికంగా శారీరకంగా వేదించినట్లయితే సహాయం పొందేందుకు 1930 మరియు 112 లేదా 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.వ్యక్తిగత ఓటీపీ సమాచారాన్ని ఇతరులకు పంపరాదని ఫోటోలను షేర్ చేయరాదని వివరించారు.విద్యార్థినిలకు ఏదైనా బెదిరింపు ఫోన్లు వచ్చిన వేధించిన పోలీసులకు నేరుగా సమాచారం ఇవ్వాలని అలాంటి వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.నిత్యం పరిసరాలలో ఉండే వారే ఫేక్ ఖాతాల ద్వారా అమ్మాయిలను వేధిస్తున్నారని అమ్మాయిలు ఫోన్ వాడే సందర్భంలో అతి జాగ్రత్తగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమం లో న్యాయవాది అర్జునయ్య బ్యాంక్ అధికారులు అంజయ్య శ్రీనివాసులు,రాజు, రవితేజ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపకులు కోదండరాములు,సతీష్, షీ టీం ఇన్చార్జ్ విజయలక్ష్మి సభ్యులు వెంకటయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.