సొంత ఖర్చుతో విద్యార్థులకు మద్యా(అ)న్న భోజనం పెట్టిన బలరాం జాదవ్.

సొంత ఖర్చులతో రెండవ సంవత్సరం కూడా దాదాపు 300ల మంది విద్యార్థుకు మద్యాహ్న భోజనం అందిస్తు
అన్నిధానాల కంటే అన్నధానం గొప్పదని పలువురి ప్రశంసలు అందుకున్న బలరాం జాధవ్. బుధవారం రోజునమండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో వివిధ గ్రామాల నుండి విద్యార్థులు కళాశాలకు వచ్చిచదువుకుంటారు.వారు ఆకలితో రావడం గమనించిన సామాజిక సేవకుడు బలరాం జాదవ్ పిల్లల ఆకలి తీర్చాలని అనుకున్నాడు.ప్రభుత్వం కళాశాలల్లో మద్యాహ్న భోజనం ప్రారంభిస్తామని చెప్పినప్పటికి ఇప్పటి వరకు దాని ఊసెత్తక పోవడం ఏంటని పిల్లలకు ఎలాగైన అన్నం పెట్టాలన్న ఆశయంతో బుధవారం నుండి కళాశాలలో తన సొంత ఖర్చులతో మద్యాహ్న భోజనం ప్రారంభించారు.తెలంగాణరాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఈ కళాశాలలో మద్యాహ్న భోజనం ప్రారంభించడం హర్షించదగ్గ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు బలరాంను అభినందించారు.ఆయన మాట్లాడుతు మా కళాశాలలో విద్యార్ధులు మద్యాహ్నం వరకు ఉండి ఆకలి అయితుందని అడిగివెళ్ళేవారని,మారుమూల   దూర గ్రామాల నుండి నడిచి వస్తున్నామని చెప్పేవారని  విద్యార్థుల ఆకలి ఎలాగైనా తీర్చాలని గత సంవత్సరం నుండి ప్రారంభించానని అన్నారు.పేదపిల్లలు కడుపు కాల్చుకొని కళాశాలకు రావడం,ఆకలి వల్ల సరిగా చదవలేరన్న విషయం నా గతజీవితాన్నిగుర్తుచేసిందని,నాకు విద్యార్థి దశలో వచ్చిన కష్టాలు పిల్లలకు రావద్దని ఈ కార్యక్రమం ప్రారంబించానని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అద్యాపక బృందం విద్యార్థులు బలరాంకు అభినందనలు తెలిపారు.

తాజావార్తలు