సొమ్మసిల్లి పడిపోయిన తెరాస నేత శ్రవణ్
హైదరాబాద్ : చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇందిరాపార్క్‌కు చేరుకున్న తెరాస నేత శ్రవణ్ సొమ్మసిల్లి పడిపోయారు. శ్రవణ్‌తో పాటు అక్కడి చేరుకున్న తెరాస కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో తోపులాట జరిగింది. దీంతో రోడ్డుపై శ్రవణ్ సొమ్మసిల్లి పడిపోయారు. తేరుకున్న అనంతరం పోలీసులు శ్రవణ్‌ను అరెస్టు చేశారు.