సోనియాతో రాష్ట్ర నేతల భేటీ
న్యూఢిల్లీ : యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీతో రాష్ట్ర నేతలు భేటీ అయ్యారు. కేంద్రమంత్రి బలరాంనాయక్, మంత్రి గీతారెడ్డి, గల్లా అరుణతోపాటు పలువురు నేతలు బేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా సోమవారం సోనియాను కలిసే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిని మార్చొద్దని వీరు విన్నవించినట్లు తెలుస్తోంది. సోనియాతో రాష్ట్ర నేతలు భేటీ కావడంతో రాష్ట్రంలో పలు చర్చలు జరుగుతున్నాయి. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని మార్చుతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.