సోమవారం నిర్వహించి ప్రజావాణి కార్యక్రమం రద్దు.
జిల్లా కలెక్టర్ నిఖిల.
తాండూరు అగస్టు 7(జనంసాక్షి)సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిఖిల ఒక ప్రకటనలో తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను జిల్లాలో ఈరోజు నుండి 15 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నందున ఈనెల 8న ప్రజా సమస్యల పరిష్కారం కొసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అధికారులు అందరు వజ్రోత్సవ కార్యక్రమాలలో బిజీగా ఉన్నందున ప్రజావాణి నిర్వహించడం లేదని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ముందస్తుగా తెలియజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.