సోమాజీగూడలో లలితా జ్యూవెల్లరి ప్రారంభం
-రెండు నెలల్లో కూకట్‌పల్లిలో షోరూం ప్రారంభం
-లలితా జ్యువెల్లరీ చైర్మన్ ఎం కిరణ్ కుమార్ వెల్లడి
హైదరాబాద్
నాణ్యత ప్రమాణాలు పాటించే నగలకెప్పుడూ గిరాకీ ఉంటుందని, అలాంటి షోరూమ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన లలితా జ్యూవెల్లరీ షోరూమ్ నిర్వాహకులను మంత్రి కె.తారకరామారావు అభినందించారు. దక్షిణ భారత దేశంలో అగ్రగామిగా భాసిల్లుతున్న లలితా జ్యువెల్లరి ప్రతిష్టాత్మకమైన, అదిపెద్ద షోరూం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఆదివారం అంగరంగవైభవంగా జరిగింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, గనులు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె తారకరామారావు సతీసమేతంగా విచ్చేసి షోరూంను ప్రారంభించారు. వజ్రాభరణాల విభాగాన్ని లైకా గ్రూపు చైర్మెన్ ఎ సుభాస్కరణ్ దంపతులు ప్రారంభించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ జ్యోతి ప్రజ్వలన చేశారు. హోమ్ శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎంపీ టి సుబ్బరామిరెడ్డి, శివ గ్రూపు చైర్మెన్ సి శివశంకరన్, డీసీ డిజైన్ ప్రై లిమిటెడ్ చైర్మెన్ దిలీప్ చాబ్రియా, వేల్స్ విశ్వవిద్యాలయం (చైన్నె) చైర్మెన్ డాక్టర్ ఐసరి కె గణేశ్, అడయార్ ఆనందభవన్ మేనేజింగ్ డైరెక్టర్ కేటీ శ్రీనివాసరాజా తదితరులు గౌరవ అతిథులుగా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. లలితా జ్యూవెల్లరికే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ షోరూం ప్రపంచంలోనే అతి పెద్ద షోరూంలలో ఒకటని లలిత్ జ్యూవెల్లరి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ యం. కిరణ్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్ వాసులతో పాటు తెలంగాణ ప్రజలకు అందం చిందే ఆకర్షణీయమైన డిజైన్లు, అద్బుతమైన పనితనాన్ని చాటే నగలు అత్యంత తక్కువ తరుగుకే తమ షోరూంలో లభిస్తాయని ఆయన చెప్పారు. ‘హిడన్ చార్జీల భారం మోపకుండా సరసమైన ధరకు నగలు అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. తయారీ ధరకే బంగారు నగలు అందించడంతోపాటు ఎలాంటి జిమిక్కులు లేకుండా పారదర్శకమైన పద్ధతిన నాణ్యమైన నగలు ఇస్తున్నామని కిరణ్ కుమార్ తెలిపారు. సోమాజీగూడలో లలితా జ్యూవెల్లరిని 1,30,000 చ.అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.ఇది ప్రపంచంలోనే అతిపెద్ద షోరూమ్‌లలో ఒకటిగా నిలవనుందన్నారు. ఈ షోరూంలో బంగారం, వజ్రం, వెండి, ప్లాటినమ్ ఆభరణాల లభ్యం కానున్నాయి. ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఏపీలోని విజయవాడ, రాజమండ్రిలో సైతం షోరూంలు ఏర్పాటు చేయనున్నట్లు కిరణ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం 14 షోరూంల ద్వారా వార్షిక టర్నోవర్ రూ.11 వేల కోట్ల స్థాయిలో ఉందని, ఈ ఏడాదిలో రూ.15 వేల కోట్లకు చేరుకోవచ్చన్నారు. 2020కల్లా టర్నోవర్‌ను రూ.50 వేల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా పరిమిత కాలానికి ప్రత్యేక సదుపాయాలు అందిస్తున్నట్లు లలితా జ్యువెల్లరీ ప్రకటించింది. అన్ని బంగారు నగలుపై తరుగులో ఒక శాతం రాయితీ లభించనుంది. అన్ని వజ్రాభరణాలపై క్యారెట్‌కు రూ.2వేల తగ్గింపు సదుపాయం కల్పిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఆదివారం జరిగిన షోరూం ప్రారంభోత్సవంలో రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఖైరతాబాద్ శాసనసభ సభ్యులు చింతల రామచంద్రారెడ్డి, పార్లమెంట్ సభ్యులు టీ సుబ్బిరామిరెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు.