సౌదీలో తొలి మహిళా విజయం

2

హైదరాబాద్‌,డిసెంబర్‌13,(జనంసాక్షి): సౌదీ అరేబియాలోని శనివారం జరిగిన స్థానిక ఎన్నికల్లో తొలిసారిగా ఓ మహిళా అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో  మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే. కాగా..  స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం కొనసాగుతోంది. మక్కాలోని మద్రాకా కౌన్సిల్‌లో సల్మా బింట్‌ హిజాబ్‌ అల్‌ ఒటెబీ అనే మహిళా అభ్యర్థి విజయం సాధించినట్లు బంగ్లా ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. ఈ స్థానంలో మొత్తం ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళలు పోటీపడగా.. సల్మా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 284 సీట్లకుగానూ.. 6వేల మంది పురుషులు, 900మంది మహిళలు పోటీపడ్డారు. తల నుంచి పాదాల వరకు మహిళలు పూర్తిగా వస్త్రంతో కప్పుకోవాలనే కఠిన నిబంధనలున్న సౌదీ అరేబియాలో తొలిసారిగా మహిళలు ఎన్నికల్లో పోటీ చేయడమేగాక, తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. అయితే ఎన్నో నిబంధనల మధ్య ఈ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికల ప్రచారంలో మహిళా అభ్యర్థులు పురుష ఓటర్లను ఓట్లు అడగరాదనే నిబంధన ఉంది. అంతేగాక, మహిళలకు, పురుషులకు వేర్వేరుగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు.