స్క్రాప్ దుకాణం యజమానికి జరిమానా.

బెల్లంపల్లి, అక్టోబర్ 15, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణం మహమ్మద్ ఖాసీం బస్తి లోని స్క్రాప్ దుకాణం యజమానికి శనివారం మున్సిపల్ సిబ్బంది జరిమానా విధించారు. పట్టణంలోని స్క్రాప్ దుకాణం పరిసర ప్రాంతాల్లో దుకాణం యజమాని ఎండి ముఖిమ్ చెత్త, బీర్ సీసాలు, పనికిరాని గూడ్స్ ను ఇష్టానుసారంగా రోడ్ల పైన వేసి పబ్లిక్ కు ఇబ్బంది కలిగిస్తున్నారని మున్సిపల్ అధికారుల దృష్టికి వచ్చినందున స్క్రాప్ దుకాణం యజమానికి ₹ 10,000 జరిమానా విధించినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ ఉదయ్ కిరణ్, హెల్త్ అసిస్టెంట్ సోల రాజు, జవాన్లు శ్రీను, రామస్వామి పాల్గొన్నారు.