స్టాక్‌మార్కెట్లపై జీఎస్‌టీ ప్రభావం
ముంబయి: రాజ్యసభలో ఇవాళ జీఎస్‌టీ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో ఆరంభం నుంచే స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 141 పాయింట్లు కోల్పోయి 27,840 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 31 పాయింట్లకు పైగా నష్టపోయి 8,591 వద్ద కొనసాగుతోంది. జీఎస్‌టీ అంశం ఏమవుతుందోనని ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.