స్టే కు సుప్రీంకోర్టు నిరాకరణ

supremecourtకేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పెద్ద నోట్ల రద్దును కొట్టివేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ దీనిపై విచారణ జరిపింది. నోట్ల రద్దుతో ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించడానికి, బ్యాంకులలో రద్దీని తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీం బెంచ్ సూచించింది. దేశంలో నల్లధనం 15 నుంచి 16 లక్షల కోట్ల ఉన్నాయని, ప్రజలు 10 నుంచి 11 లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు.