స్త్రీ నిధి కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

-జోనల్ మేనేజర్ శ్రీనివాస్, రీజినల్ మేనేజర్ మధుసూదన్

మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్31(జనంసాక్షి)

మానుకోట జిల్లా సమాఖ్య భవనంలో మంగళవారం స్త్రీ నిధి జిల్లా స్థాయి సలహ, సంప్రదింపుల కమిటీ (డీలసిసి)సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్త్రీ నిధి జోనల్ మేనేజర్ పి.శ్రీనివాస్, మహబూబాబాద్ జిల్లా రీజినల్ మేనేజర్ సంగెం మధుసూదన్, సహాయక మేనేజర్ జబీనా బేగం హాజరై జిల్లా లోని 16 మండల సమాఖ్య ఓ.బి సభ్యులు ఇద్దరు చొప్పున 32 అధ్యక్ష ,కార్యదర్శులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి సంఘాల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. స్త్రీనిధి ఋణ లక్ష్య సాధన సెప్టెంబర్ చివరి నాటికి 50% పూర్తి అయి ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి రాష్ట్రంలో మొదటి స్థానంలో వుండేందుకు క్రమబద్ధమైన వ్యూహం తో ముందుకు వెళ్లాలని ఓ.బి సభ్యులకు సూచించారు. స్త్రీనిధి ఋణ బకాయిలు నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) తగ్గించుటకు సరైన ప్రణాళికతో సెప్టెంబర్ చివరి లోపు 5% ఎన్పీఏ లోపు, మార్చి చివరి నాటికి 1% లోపు జరిగేల తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. స్త్రీనిది ఋణల చెల్లింపులు బిబిపిఎస్ ఫోన్ పే,గూగుల్ పే మర్చెంట్ బ్యాంక్ లు అయిన ఫీనో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ లతో, అందుబాటులో ఉన్న విఎల్ఈ ద్వారా అయిన నేరుగా ఎస్,హెచ్,జి నుండి అప్పు రిపేమెంట్ చేయాలని అన్నారు. సంఘం లోని సభ్యులకు పారదర్శకత కొరకు ఏర్పాటు చేసిన స్త్రీనిధి ఆప్ జిల్లాలో ఉన్న అన్ని సంఘాల అధ్యక్షులు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఎస్ఎన్ సోషల్ ఆడిట్ అమలు, అవకతవకలు తగ్గించడానికి చేపట్టే చర్యలు పై చర్చించి మండల, పట్టణ సమాఖ్యలకు స్త్రీ నిధి ద్వారా ఇచ్చే వడ్డీ మార్జిన్ పై వివరించారు. దీని ద్వారా సమాఖ్యలకు ఎవిందంగా లబ్ది చేకూరుతుందనే విషయాన్ని వివరించారు. స్త్రీ నిధి సురక్ష, సురక్ష బి, పశు బీమా పథకం పై అవగహన కల్పించి ఏదైనా రిస్క్ జరిగితే సంభందిత ఏరియా మేనేజర్ కు తెలియ పర్చాలని వారు కోరారు. స్త్రీ నిధి ప్రత్యేక రుణాలైన ఎలక్ట్రిక్ ఆటో, బైక్స్, నాటు కోళ్ల పెంపకం, పాడి పశువుల ఋణాలు పై అవగాహన కల్పించారు. గ్రామ స్థాయి స్త్రీ నిధి విఎల్ఈ ల పనితీరు పై చర్చించి పనితీరు మెరుగుపరచడానికి ఇచ్చే సలహాలు, సూచనలు తీసుకున్నారు.