స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ వ్యక్తి మృతి

స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ వ్యక్తి మృతి

నల్గొండ : మూసీ నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ సంఘటన వలిగొండ మండలం పొద్దుటూరులో జరిగింది. వలిగొండ పట్టణానికి చెందిన జోగు సైదులు(24) అనే వ్యక్తి ఓ ఫంక్షన్ నిమిత్తం తన కుటుంబం సభ్యులతో కలిసి పొద్దుటూరు గ్రామంలో ఉన్న మేనమామ ఇంటికి వెళ్లాడు. మూసీనదిలో స్నానానికి దిగిన సైదులు నీటిలో మునిగి చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.