స్నేహితుడే చంపేశాడు

నల్గొండ: మద్యం మత్తులో ప్రాణ స్నేహితులే బద్దశత్రువులయ్యారు. అప్పటివరకు ‘దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్’ అంటూ పాటలు పాడుకున్న వాళ్లే.. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లా సూర్యపేట శివారులోని భగత్‌సింగ్‌నగర్‌లో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన టి.శ్రీను, నాగభూషణం ఇద్దరు గురువారం రాత్రి మద్యం సేవిస్తూ గొడవపడ్డారు.

ఘర్షణలో భాగంగా శ్రీను అనే వ్యక్తి నాగ భూషణంపై చేయి చేసుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన నాగభూషణం కొబ్బరి బోండాలు నరికే కత్తితో శ్రీనును నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. నిందితుడు పరారయ్యాడు.