స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రోగులకు పండ్లు పంపిణీ.
యువ నాయకులు ఎం శ్రీనివాస్.
తాండూరు అగస్టు 7(జనంసాక్షి) స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తాండూర్ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో యువ నాయకులు ఎం శ్రీనివాసులు ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా యువ నాయకులు ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో స్నేహం విలువ వెలకట్టలేనిది అని గుర్తుచేశారు. కష్టకాలంలో మంచి చెడులకు తోడుగా ఉంటూ స్నేహితులు
అండగా ఉంటారని పేర్కొన్నారు స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని కొనియాడారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా జిల్లా ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేయడం సంతోషకరమని అన్నారు.
జీవితాంతం గుర్తుండిపోయే ది స్నేహం ఒక్కటేనని తెలిపారు. ప్రతి ఒక్కరూ సేవ చేసే తత్వాన్ని అలవర్చుకోవాలని కోరారు.
స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.