స్నేహితుల దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్న యువత

వేములవాడ రూరల్, ఆగస్టు 7 (జనం సాక్షి) : ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని యువత ఉత్సాహంగా జరుపుకున్నారు. వేములవాడ నాంపల్లి గుట్టపై యువత స్నేహితుల దినోత్సవం సందర్భంగా పార్టీలను నిర్వహించారు. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్నేహితులను కలుపుకొని ఎంజాయ్ చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ ఈరోజు ఇలా ఎంజాయ్ చేయడం ఆనందంగా ఉందన్నారు.