స్మృతి వనంలో పార్క్ మరియు జిమ్ పరికరాలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్
గద్వాల రూరల్ జూన్ 21 (జనంసాక్షి):- గద్వాల్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డ్ రాజీవ్ మార్గ్ స్మృతి వనంను మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ పార్కును మరియు జిమ్ పరికరాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్బంగా పార్కులో పెరిగిన పిచ్చి మొక్కలను ఎప్పటికి అప్పుడు తొలగించాలన్నారు. అదేవిదంగా జిమ్ పరికరాలను మర్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకీ తీసుకురావలన్నారు వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. పార్కు వచ్చే సందర్శకులు మరియు వాకింగ్ ఉదయం సాయకాలం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు చైర్మన్ కేశవ్ ఆదేశించారు.అనంతరం రాజీవ్ మార్గ్ మధ్య ఉన్న డివేండర్ లో పెరిగిన పిచ్చి మొక్కలను చైర్మన్ కేశవ్ స్వయంగా కత్తిరించారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కృష్ణ, తెరాస పార్టీ నాయకులు బొట్టు సుధాకర్ ,నాగులు యాదవ్ ,భగీరథ వంశీ చిరంజీవి ,హరీష్ మరియు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.