స్వచ్ఛత కరువైన స్వచ్ఛ నగరం
బిన్ ఫ్రీ సిటీ అని చెత్త కుండీలులేని నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం లో పట్టణంలో ఉన్న అన్ని కుండీలను తీసివేయడం జరిగింది.కానీ ఇంటింటి చెత్త వాహనాలు సరిపడా లేకపోవడం,ప్రతి ఇంటి నుండి వంద శాతం లిఫ్ట్ చేయకపోవడం, ప్రజలల్లో అవగాహన లోపం వల్ల చెత్త బండికి చెత్త ఇవ్వకపోవడం తదితర కారణాల వల్ల ప్రజలందరూ రోడ్డు మార్జిన్లలో,ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తున్నారు.
గతంలో డస్ట్ బిన్ ఉన్నప్పుడు డస్ట్ బిన్ లో మాత్రమే వేసేవారు.ఇప్పుడు రోడ్డు మార్జిన్ మొత్తం డస్ట్ బిన్ లానే తయారయింది.గతంలో బిన్ లు ఉంటే వెహికిల్ వచ్చి లిఫ్ట్ చేసుకెళ్ళేది. అప్పుడు సులభంగా చెత్త లిఫ్ట్ అయ్యేది.ఇపుడు బిన్స్ తీసేయడం వల్ల ఓపెన్ డంపింగ్ చేస్తున్నారు.అది మున్సిపాలిటీ టైం కి లిఫ్ట్ చేయలేకపోతుంది.దాంతో నగరం అంతా చెత్త మయం అయిపోయింది.
వెహికిల్స్ మీద పర్యవేక్షణ లోపం
వెహికిల్స్ ఇవ్వడంలో లబ్ధిదారులను గుర్తించడంలో మునిసిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ లు ,మెడికల్ ఆఫీసర్లు పెద్ద లెవల్ దందా చేసుకుంటున్నారు.కాబట్టి వాటి మీద పర్యవేక్షణ లోపం క్లియర్ గా కనపడుతుంది.ఇంటింటికి చెత్త తీసుకోక పోగా వాహనాలలో ప్రయివేటు పనులు చేసుకుంటున్నారు.మున్సిపాలిటీ సదుద్దేశంతో మొదలు పెట్టిన ఈ స్కీం దుర్వినియోగం అవుతుంది.వాహనాలకు సంబంధించి ఇంస్టాల్మెంట్ కట్టేది మున్సిపాలిటీ కానీ మున్సిపాలిటీ లో పనిచేయకుండా ప్రయివేటుగా పని చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు.ప్రజలకు వాహనాలు అందుబాటులో లేకపోవడంతో,కుండీలు అందుబాటులో లేకపోవడంతో రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు.
అధిక డబ్బులు వసూలు
మున్సిపాలిటీ గతంలో ఇంటింటికీ రూ.50 మాత్రమే వసూలు చేయాలని చెప్పింది.డ్రైవర్లు రూ.50 కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు.అడిగినంత ఇవ్వకపోతే చెత్త తీసుకెళ్లడం మానేస్తున్నారు.వీరు కమర్షియల్ ఏరియాలల్లో హోటల్స్, హాస్పిటల్స్,హాస్టల్స్ లో ఎక్కువ డబ్బులు ఇస్తారు కాబట్టి వారి దగ్గరే చెత్తను కలెక్ట్ చేస్తున్నారు.గృహ వినియోగదారులకు అందుబాటులో ఉండటం లేదు.
ఊడ్చేవారు కూడా వసూళ్లు
ప్రతి కాలనీలో వారానికి ఇద్దరు, ముగ్గురు చొప్పున వచ్చి క్లీన్ చేసేవారు కూడా చాయ్ పైసలంటూ, పండుగ ఈనామ్ అంటూ వసూలు చేయడం,ఇవ్వకపోతే కాలనీలలో చెత్త క్లీన్ చేయకపోవడం జరుగుతుంది.ఎప్పుడైనా ఒకసారి అంటే ఇస్తాము కానీ డిమాండ్ చేయడం,ఇవ్వకపోతే తిడుతున్నారంటూ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పారిశుధ్య కార్మికులు,ఆటోల నుండి ఎస్ఎఫ్ఏ ల వసూళ్లు
పారిశుద్ధ్య కార్మికులు ప్రతి నెల ఒక్కోక్కరు నెలకు రూ.500ల చొప్పున ఎస్ఎఫ్ఏ కు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇవ్వకపోతే వారిని తిట్టడం, పై స్థాయి అధికారులకు కంప్లైంట్ చేయడం జరుగుతుంది.ఒక్కో సాట్ ఆటో కి సమానంగా ఇండ్లు లేకపోవడం ఒకరికి 1000 ఇండ్లు ఉంటే మరొకరికి 300 నుండి 400 ఇండ్లు ఉండటం వీరు నుండి
ప్రతి నెల ఎస్ఎఫ్ఏ లు రూ.5 వేలు వసూలు చేయడంతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తుంది.
చెత్త డబ్బాకు రూ.150 తీసుకుంటున్నారు
– శైలజ,గృహిణి
చెత్త బండి రోజు విడిచి రోజు లేకపోతే 2,3 రోజులకు ఒకసారి వస్తుంది.గతంలో రూ.100 తీసుకునేవారు కానీ ఇప్పుడు రూ.150 తీసుకుంటున్నారు. ఇంట్లో చెత్త మాత్రమే వేయాలని చెప్తున్నారు.వర్షాల వల్ల చిన్న చిన్న మొక్కలు పెరిగాయని వాటిని తొలగించిన ఇస్తే వేయొద్దని అంటున్నారు. డబ్బులు అడిగినంత ఇచ్చినా కూడా పూర్తి స్థాయిలో చెత్త తీసుకెళ్లడం లేదు.
వారు వచ్చే టైం కి ఇంటి వద్ద ఉండము.
– శ్రీలత,ఎంప్లాయి
నేను, మా వారు ఇద్దరం బయట పనికి వెళ్తాము. చెత్త బండి మేము ఉన్న టైం లో రాదు. ఎప్పుడో వెళ్ళిపోయాక వస్తుంది. గేట్ లోపల డస్ట్ బిన్ పెట్టి వెళ్తాము. కనీసం అది తీసుకెళ్లామని చెప్పినా కూడా గేట్ తీసి తీసుకువెళ్లరు.ఎక్కువ అయినప్పుడు బయట ఓపెన్ డంపింగ్ లో పడేయాల్సి వస్తుంది. ప్రతి నెల రూ.120 తీసుకుంటారు కానీ వారం చెత్త ఇంట్లోనే ఉండిపోతుంది.
అడిగినంత ఇవ్వకపోతే తిడుతున్నారు
-సుజాత,గౌతమ్ నగర్
మేము అపార్టుమెంటు లో ఉంటాము. చెత్త కోసం రూ.100 ఇస్తున్నాము.కానీ ఊడ్చేవారు నెలనెలా డబ్బుల కోసం వస్తున్నారు.చిల్లర ఉన్నప్పుడు అడిగితే ఇస్తున్నాము.ఒకవేళ లేనప్పుడు ఇవ్వకపోతే బూతులు తిడుతున్నారు. అడుక్కుంటే చాయ్ తాగడానికి ఇస్తాము కానీ డిమాండ్ చేసి, తిడితే ఎలా ఇస్తాము.డబ్బులు ఇవ్వకపోతే చాలా అవమానిస్తున్నారు.
ఒక్క డబ్బాకు రూ.100,వారానికి రూ.300 ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు
-శిరీష, సాయి రెడ్డి కాలనీ వైస్ ప్రెసిడెంట్
మేము నెలకు రూ.100 చెత్త వారికి ఇస్తున్నాము.ఈ నెల నుండి రూ.150 ఇవ్వాలని డిమాండ్ చేశారు.మేము ఇవ్వమని చెప్పాము. జిహెచ్ఎంసి సర్క్యులర్ కాపీ ఉంటే చూపించండి అంటే అందరూ ఇస్తున్నారని ఆర్గ్యు చేస్తున్నారు.ఒక్క ఇంటిలో చెత్త డబ్బాలు ఎన్ని ఉంటే అన్ని వందలు వసూలు చేస్తున్నారని కాలనీ వారు మాకు కంప్లైంట్ చేస్తున్నారు.మేము వారు వచ్చే టైం కు ఆఫీసుకు వెళ్తాము. కనీసం గేట్ తీసుకుని చెత్త తీసుకెళ్లరు. అది అలానే ఉండటం వల్ల పిల్లులు, కుక్కలు అంతా చిమ్మేస్తున్నాయి.చెత్త తీసుకెళ్లేప్పుడు వారు వారి డబ్బాలో వేసుకునేప్పుడు కింద పడినవి కూడా తీయరట.అది మా పని కాదు అంటున్నారు.5,6 సంవత్సరాల నుండి వీరే వస్తున్నారు అని చూస్తున్నాము. జిహెచ్ఎంసి వీరిని మారిస్తే బాగుంటుంది.ఊడ్చేవారు నెలకు 3 సార్లు ముగ్గురు వస్తారు.వారికి కూడా ప్రతి వారం రూ.300 ఇవ్వాలంటే కష్టం అవుతుంది. నెలకు ఒకసారి అంటే ఇవ్వొచ్చు కానీ వచ్చి వచ్చినప్పుడల్లా అంటే ఎలా ఇస్తాము. వారి వచ్చి ఇంటి ముందు కూర్చుంటున్నారు. ఇవ్వడం మానేయడంతో ఇప్పుడు ఊడ్చడానికి ఎవరూ రావడం లేదు. కాలనీ మొత్తం చెత్త చెత్త గా తయారయింది.
ReplyForward
|