స్వచ్ఛ కార్యక్రమాలలో అందరూ భాగస్వామ్యులు కావాలి

స్వచ్ఛ కార్యక్రమాలలో అందరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి కోరారు.
శనివారం నాడు యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో వరల్డ్ టాయ్లెట్ డే సందర్భంగా స్వచ్చ భారత్ మిషన్ గ్రామీణ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా రన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.స్వచ్ఛతా రన్ లో ప్రజాపతినిథులు, గ్రామస్థులు, విద్యార్థులు, అంగన్వాడీ, ఆశా సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా స్వచ్చతా ప్రతిజ్ఞ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,  గ్రామాలలో ప్రతి ఇంటిలో వంద శాతం మరుగుదొడ్లు వున్నాయని, వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడైతే సెప్టిక్ ట్యాంక్ ఉందో దానికి అనుసంధానంగా ఇంకుడు గుంత కట్టుకోవాలని, తద్వారా అది ఎరువుగా మారి వాతావరణం కలుషితంగా కాకుండా ఉంటుందని,  ఆరోగ్యపరంగా కూడా ఇది మంచి పద్దతి అని, టాయ్లెట్ లో సింగిల్ బిట్ వున్నదానిని డబుల్ బిట్ గా మార్చుకోవాలని, ఆర్ధికంగా స్వంతంగా భరించలేని వారికి గ్రామ పంచాయితీ నుండి సహాయం అందుతుందని, కట్టుకునే స్తోమత ఉన్న వారికి ఉపాధి హామీ సిబ్బంది ద్వారా మార్కింగ్ సహాయం అందుతుందని తెలిపారు. అన్ని గ్రామాలలో సెగ్రిగేషన్ షెడ్స్, ట్రాక్టర్స్ ఉన్నందున పారిశుద్య చర్యలు పకడ్బందీగా నిర్వహించాలని, తద్వారా ఎలాంటి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉండదని తెలిపారు. గ్రామాలలో పారిశుద్య కార్యక్రమాలను ఇంకా మెరుగుపరుచుకునేందుకు అందరూ భాగస్వామ్యులై స్వచ్ఛతా కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు.కార్యక్రమంలో జడ్.పి.టి.సి. టి.అనూరాధ, ఎంపిపి శ్రీశైలం, ఎంపిడిఓ ప్రభాకర్రెడ్డి, ఎంపిఓ చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ కె.కవిత, ఎంపిటిసి మౌనిక, తదితరులు పాల్గొన్నారు