స్వచ్ఛ నాగావళి ఆరంభం
శ్రీకాకుళం,జూన్4(జనం సాక్షి): పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్వచ్ఛ నాగావళి కార్యక్రమాన్ని కలెక్టర్ కె ధనంజయ రెడ్డి ప్రారంభించారు. నాగావళిని స్వచ్ఛంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందిరదన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మంగళవారం స్వచ్ఛ శ్రీకాళం కార్యక్రమం ప్రారంభిచనున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్, కాలుష్య రహిత తీరంగా నాగావళిని తీర్చిదిద్దాలన్నారు. 50 మైక్రాన్లకు తక్కువ ఎ/-లాస్టిక్ వినియోగం నగరంలో నిషేదించమన్నారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ నుండి రుద్ర కోటేశ్వర స్వామి ఆలయం వద్ద నాగావళి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గుండ లక్ష్మీ దేవి, నగర పాలక సంస్థ కమిషనర్ ఆర్ శ్రీరాములు నాయుడు, రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ పి.జగన్మోహన్‌రావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.సాయిరాం, విద్యార్ధులు పాల్గొన్నారు.