స్వతంత్ర్య సమరయోధుడు,తెలంగాణ పోరాటయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం భవిష్యత్ తరాలకు నిదర్శనం …జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య.
ములుగు బ్యూరో,సెప్టెంబర్27(జనం సాక్షి):-
స్వతంత్ర్య సమరయోధుడు,తెలంగాణ పోరాటయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం భవిష్యత్ తరాలకు నిదర్శనం అని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు.మంగళ వారం కలెక్టరేట్ లో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా అయన చిత్ర పటానికి పూల మాలలు వేసి జిల్లా కలెక్టర్ నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరంకుశ, నిజం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండ లక్ష్మణ్ బాపూజీ కొమరం భీం జిల్లా,వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27 న జన్మించారని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ గర్వించదగిన గొప్ప వ్యక్తి అని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిదని కలెక్టర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడిగా, నిబద్దతతో కూడిన రాజకీయ నాయకుడిగా కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం భవిష్యత్ తరాలకు నిదర్శనం అన్నారు.సమాజంలోని అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడమే కాకుండా తెలంగాణ కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన బాపూజీ గత తెలంగాణ ఉద్యమంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు.కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి,వర్ధంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆయన గౌరవార్థం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వైవి గణేష్,సిపి ఓ. ప్రకాష్,కలెక్టరేట్ ఏవో విజయ భాస్కర్,కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Attachments area