స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

చేవెళ్ల ఆగస్టు 12 (జనంసాక్షి) చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేజీబీవీ పాఠశాల విద్యార్థినిల మధ్యలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు కార్యక్రమంలో  భాగంగా జాతీయ సమైక్యత రక్ష బంధన్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు రాఖీ పండుగ జరుపుకున్నారు.చిన్నారులు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టగా వారికి శుభాకాంక్షలు తెలిపి మంత్రి ,ఎమ్మెల్యేలు ఆశీస్సులు అందించారు. విద్యార్థినిలకు డిక్షనరీలు  పంపిణీ చేసి, బాగా చదువుకోవాలని పిలుపునిచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, పాఠశాలలో భోజనం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు,
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేసిన మంత్రి సబితా రెడ్డి గారు,ఎమ్మెల్యే యాదయ్య గారు. ప్రభుత్వం విద్యాలయాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో పేదింటి అడబిడ్డల వివాహాలకు కల్యాణ లక్ష్మి,షాది ముబారాక్ లతో అండగా ఉంటున్నారని అన్నారు.ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలతో విశ్వ విద్యాలయాలలో అమ్మాయిల శాతం పెరిగిందని, దాంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయించారని తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా మంత్రి ఇంద్రారెడ్డి మహిళలకు,విద్యార్థినిలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివలీల చింటూ, మిట్ట రంగారెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు