స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్
మిర్యాలగూడ.జనం సాక్షి
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు (వజ్రోత్సవాలు) పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు ‘‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ’’ వేడుకలను నిర్వహించనుందని
మంగళవారం మున్సిపల్ సమావేశం మందిరంలో చైర్మన్ అధ్యక్షతన జరిగిన ప్రిపెట్టరి సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ అన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు.కాగా వజ్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 8వ తారీఖు నుండి 22వ తారీకు వరకు నిర్వహించు కార్యక్రమంలో భాగంగా 10వ తారీఖున ఫ్రీడమ్ పార్కును ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు మరియు జాతీయ పతాకాల పంపిణీ కార్యక్రమం 27వ వార్డు లో చైర్మన్ మరియు ప్రజాప్రతినిధుల ద్వారా కార్యక్రమం మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని వివరించారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్ గారు వైస్ చైర్మన్ విష్ణు గౌరవ కౌన్సిలర్లు మరియు మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు