స్వతంత్ర భారత వజ్రోత్సవ ఫ్రీడం రన్ రంగ రంగ వైభవంగా

ముస్తాబాద్ ఆగష్టు 11జనంసాక్షి స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో, ప్రజా భాగస్వామ్యంతో మండలంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం తెలంగాణ చౌరస్తా  నుంచి రైతు వేదిక అయ్యప్ప టెంపుల్  వరకు ఫ్రీడం రన్నిర్వహించి,  నినాదాలు చేస్తూ దేశ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో, ఎంపిపి జనగామ శరత్ రావు, జడ్పిటిసి గుండం నరసయ్య మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ ,సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, ఏనుగు విజయరామరావు ,పోతుగల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శీలం జనాభాయ్, గ్రామ సర్పంచి  సుమతి  తహశీల్దార్ మునీందర్, ఎంపీడీవో రమాదేవి, వైద్యాధికారి, ఎస్సై వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బంది టిఆర్ఎస్ మండల అధ్యక్షులు భూంపల్లి సురేందర్ రావు కల్వకుంట్ల శ్రీనివాస్ రావు ,ఎండి సర్వర్ ఎండి సాదుల్ పప్పా, ఎద్దండి నరసింహారెడ్డి, నల్ల నరసయ్య , ఐకెపి జయసుధ, అన్వర్ సిసిలు సిఏలు, పలువురు ప్రజాప్రతినిధులు,  నాయకులు, యువకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.