స్వయం ఉపాధి ఉత్తమమైన మార్గం

మరిపెడ, సెప్టెంబర్ 28, (జనం సాక్షి ):యువతకు స్వయం ఉపాధి ఉత్తమమైన మార్గం అని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు అన్నారు. బుధవారం మున్సిపల్ కేంద్రంలోని మార్కెట్ రోడ్డులో బల్లెం మహేష్ కు చెందిన శ్రీ వెంకటరమణ పెయింట్స్ అండ్ హార్డ్వేర్ షాపు ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ డోర్నకల్ శాసనసభ్యులు డీ ఎస్ రెడ్యానాయక్ కృషి తో మరిపెడ మున్సిపాలిటీ దినధినాభివృద్ధి చెంది వ్యాపార కేంద్రంగా మారడం జరిగిందన్నారు, ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న, వీరారం గ్రామ సర్పంచ్ అజ్మీర పద్మ హరి నాయక్, కేసముద్రం మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాంపల్లి రవి,అజ్మీరా రెడ్డి, ఎంపిటిసి జిక్కి నారాయణ, దిగ్జర్ల శ్రీనివాస్, దుస్సా నరసయ్య, ముఖేష్, మునేష్, యాకూబ్, తదితరులు పాల్గొన్నారు.