స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్‌ సేవలు

2

అమృత్‌సర్‌,జులై 18(జనంసాక్షి): దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ పంజాబ్‌లోని అమృత్‌సర్‌ ఆలయంలో పనిచేశారు. వాలంటరీ సేవలో భాగంగా స్వర్ణ దేవాలయంలోని కమ్యూనిటీ కిచెన్‌లో వంటపాత్రలను శుభ్రం చేశారు. అనంతరం ఆలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.

పంజాబ్‌ ఎన్నికల సందర్భంగా ఇటీవల ఆమ్‌ ఆద్మీ పార్టీ యూత్‌ మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అందులో స్వర్ణ దేవాలయం ఫొటో పక్కనే పార్టీ ఎన్నికల గుర్తును ముద్రించారు. దీంతో ఆప్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై క్షమాపణ చెప్పేందుకు కేజ్రీవాల్‌ నేడు పంజాబ్‌ వచ్చి ఆలయంలో సేవ చేశారు. ఆయన వెంట పార్టీ సీనియర్‌ నేతలు ఆశిష్‌ ఖేతాన్‌, హెచ్‌ఎస్‌ ఫూల్కా, భగవత్‌ మన్‌ తదితరులున్నారు.