— స్వాతంత్ర్య వేడుకలలో మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్

మహబుబ్ నగర్ ,ఆగస్టు 15,( జనంసాక్షి ):
స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ పరెడ్ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ ఎగురవేశారు. అనంతరం పోలీసు గౌరవ వందనాన్ని మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ స్వీకరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ .. మహబూబ్ నగర్ జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను జిల్లా ప్రజలకు తన స్ఫూర్తి దాయక ప్రసంగంలో వెల్లడించారు.
అలాగె  రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర భారత ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి ఎనిమిదో తారీకు నుండి 22వ తారీఖు వరకు రోజుకు ఒక వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు దీనిలో ప్రజలు ప్రజాప్రతినిధులు విద్యార్థులు అధికారులు అధికారులు కుల మత భేదం లేకుండా గొప్పగా పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు అని తెలిపారు ఆజాద్ ఇక అమృత మహోత్సవ కార్యక్రమం ఆగస్టు 22వ తారీకు వరకు ఇదే స్ఫూర్తితో కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు అదేవిధంగా అన్ని రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశవిదేశాల నుంచి పలు ప్రశంసలు అందుతున్నాయి అని తెలిపారు దేశంలో మరీ రాష్ట్రం అమలు చేయని ఎన్నో కార్యక్రమాలు నాంది పలకడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.కర్యాక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవర్ ,సీతారామ రావు ,ఎస్పీ వెంకటేశ్వర్లు ,జడ్చర్ల ఎంఎల్యే లక్ష్మ్యా రెడ్డి ,దేవరకద్ర ఎంఎల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి , అదికారులు తదితరులు పాల్గొన్నారు .