స్వాతంత్ర్య వేడుక సర్వ మతాల పండుగ – ఏ.సీ.పీ బోస్
కూసుమంచి ఆగస్టు 13 ( జనం సాక్షి ) : భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల పూర్తి కావస్తుందన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్వాతంత్ర్య వజ్రోత్సవాల ద్విసప్తాహం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వజ్రోత్సవాల నిర్వహణ కమిటీ రూపొందించిన రోజువారీ కార్యక్రమాలకు అనుగుణంగా మండల కేంద్రంలోని కూసుమంచి లో ఫ్రీడం ర్యాలీని భారీ ఎత్తున నిర్వహించారు. ఈ ర్యాలీ తాసిల్దార్ కార్యాలయం నుండి 75 మీటర్ల పొడవైన జాతీయ జెండాను విద్యార్థులు పట్టుకొని అన్ని కూడళ్లు తిరుగుతూ ప్రధాన కూడలి వరకు చేరుకున్నారు. ఈ ర్యాలీకి ముఖ్యఅతిథిగా హాజరైన ఏ.సీ.పీ బోస్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రానికి తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడి తెచ్చిన స్వాతంత్ర్యాన్ని అందరు సమానంగా అనుభవించాలని అన్ని మతాలకు వేరువేరు పండగలు ఉన్నప్పటికీ అన్ని మతాల పండుగ స్వాతంత్ర్య వేడుకని అట్టి స్వాతంత్ర్యాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకోకుండా అందరు సమానంగా జీవించాలని మరి ముఖ్యంగా విద్యార్థిని, విద్యార్థులు దురలవాట్లకు దూరంగా ఉండాలని స్వాతంత్ర్య త్యాగమూర్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని శ్రద్దగా చదువుకొని భావితరాలకు ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిసిపి బస్వా రెడ్డి, మండల తహసిల్దార్ మీనన్, సి.ఐ సతీష్, మండల అభివృద్ధి అధికారి కరుణాకర్ రెడ్డి, ఎస్సై యాసా నందీప్, మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి రమాచారి, స్థానిక సర్పంచ్ చెన్నా మోహన్, స్థానిక మండల పరిషత్ సభ్యులు మాదాసు ఉపేందర్, తెరాస మండల కార్యదర్శి ఆసిఫ్ పాషా, స్థానిక గ్లోబల్ స్కూల్ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ,విద్యార్థిని ,విద్యార్థులు, స్థానిక జే.వి.యర్ కళాశాల లెక్చరర్స్, విద్యార్థిని, విద్యార్థులు, పాలేరు జవహర్ నవోదయ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, కూసుమంచి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, స్థానిక పోలీస్ ఠాణా సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.