స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహా వేడుకలు
నల్గొండ జిల్లాలో ఆగస్ట్ 9 నుండి 22 వరకు విజయవంతంగా నిర్వహణ
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
రాష్ట్ర శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ జి. జగదీశ్ రెడ్డి మార్గదర్శనం,జిల్లా కు చెందిన ప్రజా ప్రతినిధులు ఎం.ఎల్.సి.లు,ఎం.ఎల్. ఏ.లు,స్థానిక ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం తో
జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి పర్యవేక్షణ లో నల్గొండ జిల్లాలో జిల్లా లో పక్షం రోజులుగా నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి.
పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా గ్రామ,వార్డు స్థాయిలో అన్ని చోట్ల చేపట్టిన కార్యక్రమాలు దేశభక్తి పూరిత వాతావరణంలో భారత స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని, సమర యోధుల త్యాగాలను గుర్తు చేసుకునేలా ప్రజలందరిలో దేశ భక్తి,ఐక్యత ను పురికొల్పెలా సమున్నతంగా, అంగరంగ వైభవంగా జరిగాయి.
రాష్ట్ర ప్రభుత్వం , ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు జిల్లాలో ఈ నెల 9 నుంచి 21 వరకు నిర్వహించే ‘భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహం’కార్యక్రమాలు ప్రతి రోజూ నిర్దేశించిన షెడ్యూల్డ్ ప్రకారం కార్యక్రమాలు జిల్లాలో ఘనంగా నిర్వహించడం జరిగింది .జిల్లా మంత్రి వర్యులు ఆగస్ట్ 9 న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజా ప్రతినిధుల తో ,అధికారులతో నల్గొండ లో సమావేశం జరిపి భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల నిర్వహణ పై దిశా నిర్దేశం చేశారు.
*ఆగస్టు 09 : ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభోత్సవం*
స్వతంత్ర భారత వజ్రోత్సవములో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రం లో 47 వ వార్డ్ లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్,ఎస్.పి.లు ఇంటింటికి జాతీయ జెండాల స్థానిక ప్రజా ప్రతినిధులు, పౌరులకు జాతీయ జెండాలను అందజేశారు.
*ఆగస్టు 10 : వజ్రోత్సవ వన మహోత్సవంలో* *భాగంగా.. గ్రామ గ్రామాన మొక్కలు* *నాటడం., ఫ్రీడమ్ పార్కుల ఏర్పాటు*
వజ్రోత్సవ మహోత్సవంలో భాగంగా జిల్లాలోని అన్ని పట్టణాలు గ్రామాలు పార్కులలో మొక్కలు నాటారు.
*ఆగస్టు 11 : ఫ్రీడమ్ రన్ నిర్వహణ*
వేడుకలను పురస్కరించుకొని జిల్లా కేంద్రం లోని జిల్లా పోలీస్ కార్యాలయం పరేడ్ గ్రౌండ్ నుండి కోమటి రెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు వందలాది మంది తో ఫ్రీడం రన్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, మున్సిపల్ చైర్మన్ యం. సైది రెడ్డి,వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ లు పాల్గొన్నారు
*ఆగస్టు 12 : రాఖీ దినోత్సవం సందర్భంగా వివిధ మీడియా సంస్థల ద్వారా ప్రత్యేక వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్జప్తి*
జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం రూపొందించిన దేశభక్తిని పెంపొందించే పలు చిత్రాలు, డాక్యుమెంటరీ లను జిల్లాలోని కేబుల్ స్థానిక ఛానల్లో ప్రసారం చేశారు.
*ఆగస్టు 13 : విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సామాజిక వర్గాల భాగస్వామ్యంతో వజ్రోత్సవ ఫ్రీడమ్ ర్యాలీలు*
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రం నల్గొండ లో ఎన్.జి.కళాశాల నుండి రామగిరి మీదుగా క్లాక్ టవర్ వరకు పెద్ద సంఖ్యలో పురప్రజలు విద్యార్థిని విద్యార్థులతో భారీ ఫ్రీడం ర్యాలీ తీశారు. నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మున్సిపల్ చైర్మన్ యం. సైది రెడ్డి ,జిల్లా అధికారులు,ఎన్.సి.సి.,స్కౌట్స్ అండ్ గైడ్స్,విద్యార్థినీ ,విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇదే రోజు నల్గొండ పట్టణంతో సహా జిల్లాలోని అన్ని గ్రామాల్లో,మున్సిపాలిటీ ల్లో అధిక సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఫ్రీడం ర్యాలీలో పాల్గొన్నారు.
*ఆగస్టు 14:జిల్లా కేంద్రం లో నల్గొండ ఎన్.జి.కళాశాల నుండి సుభాష్ చంద్ర బోస్ విగ్రహం వరకు భారీ జాతీయ పతాక ప్రదర్శన వందల మంది విద్యార్థుల తో నిర్వహించారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగ ధీశ్ రెడ్డి,నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి లు పాల్గొన్నారు.క్లాక్ టవర్ వద్ద 100 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు సాయంత్రం సాంస్కృతిక సారథి కళాకారుల చేత నియాజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్క్రతిక జానపద కార్యక్రమాలు.*
జిల్లా సమాచార శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారధుల సమన్వయంతో నల్గొండ ,మిర్యాలగూడ,దేవర కొండ,నాగార్జున సాగర్, మునుగొడ్,నకిరేకల్ నియోజకవర్గ కేంద్రాల్లో దేశభక్తి నేపథ్య ప్రత్యేక సాంస్కృతిక జానపద కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది
నల్గొండ లోని సెయింట్ అల్ఫోన్సస్ ఉన్నత పాఠశాల లో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి ప్రారంభించారు.అర్.డి. ఓ.జగన్నాథ రావు,డి.యం.హెచ్. ఓ డా.కొండల్ రావు,తదితరులు హాజరయ్యారు .మిర్యాలగూడ లో శ్రీ.పంక్షన్ హల్ లో,దేవర కొండ లో జడ్.పి.బాలుర ఉన్నత పాఠశాల లో,నకిరేకల్ లో జడ్.పి. బాలుర ఉన్నత పాఠశాల, తిప్పర్తి రోడ్,మును గోడ్ లో అంబేడ్కర్ చౌరస్తా లో,నాగార్జున సాగర్ నియోజక వర్గం హలీయా లో లక్ష్మి నర్సింహ గార్డెన్ లో ఈ ప్రదర్శనలు అధ్యంతం ప్రజలను ఆకట్టుకునేలా సాగాయి. జిల్లా పౌర సంబంధాల అధికారి పెద్ది శ్రీనివాస్ ఈ కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు.
*ఆగస్టు 15 : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*
స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రం లో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లాలో జరిగిన అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన, స్టాల్ ల ఏర్పాటు కార్యక్రమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విధుల నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు మంత్రి ప్రశంస పత్రాలను అందించారు.
*ఆగస్టు 16 : ఏక కాలంలో ’తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన’. సాయంత్రం కవి సమ్మేళనాలు*
జిల్లాలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం దేశభక్తిని చాటేలా గొప్పగా సాగింది పల్లె పట్టణం అంటే తేడా లేకుండా పెద్ద ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా భాగస్వామ్యమై జాతీయ గీతాలాపన చేశారు. రాష్ట్ర శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి,జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి,మున్సిపల్ చైర్మన్ యం. సైది రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు ,పెద్ద సంఖ్య లో విద్యార్థులు,ప్రజలు నల్గొండ పట్టణం క్లాక్ టవర్ సెంటర్ వద్ద కార్యక్రమంలో పాల్గొన్నారు.
అదే రోజు సాయంత్రం జిల్లా సమాచార,పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో డి.పి.అర్. ఓ పెద్ది శ్రీనివాస్ పర్యవేక్షణలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో స్వాతంత్ర స్ఫూర్తి, వజ్రోత్సవ దీప్తి అనే అంశంపై కవి సమ్మేళనం నిర్వహించారు.
54 మందికి కవులు తమ కవితలను వినిపించారు ఆధ్యాంతం పండుగ వాతావరణంలో సాగిన ఈ కవి సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, జిల్లా విద్యాధికారి బిక్ష పతి, జడ్.పి.సి. ఈ. ఓ.ప్రేమ్ కరణ్ రెడ్డి ,జిల్లా అధికారులు,సాహిత్య అభిమానులు హాజరయ్యారు.
*ఆగస్టు 17 : రక్తదాన శిబిరాల నిర్వహణ*
వేడుకల్లో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరాలను నిర్వహించారు.
జిల్లా ఆసుపత్రిలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ప్రారంభించారు . పదుల సంఖ్యలో ఉద్యోగులు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రక్త దానం చేశారు. ఏరియా ఆసుపత్రుల లో నిర్వహించిన రక్తదాన శిబిరాలకు మంచి స్పందన లభించింది.
*ఆగస్టు 18 : ఫ్రీడమ్ కప్ పేరుతో క్రీడల నిర్వహణ*
ఈ ఉత్సవాలలో భాగంగా గ్రామం మండలం జిల్లాస్థాయిలో ఫ్రీడంక పేరుతో క్రీడలను నిర్వహించారు. ఈ ఈ క్రీడల్లో విజేతలైన వారికి జిల్లా కేంద్రం లో మేకల అభినవ్ స్టేడియం లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, లు క్రీడా కారులకు బహుమతులు అందజేసి అభినందించారు.ఎమ్మెల్యే లేవేన్,కలెక్టర్ లేవెన్ మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు.
*ఆగస్టు 19 : దవాఖానాలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, పండ్లు స్వీట్ల పంపిణీ*
వేడుకల్లో భాగంగా నల్గొండ లో పౌర సరఫరాల శాఖ,సర్వే ఆండ్ రికార్డ్స్ ,మత్స్య శాఖ ద్వారా వృద్ధాశ్రమం లు, ఆనాథలకు పండ్లు,స్వీట్స్ పంపిణీ చేశారు వారి యోగక్షేమలను అడిగి తెలుసుకుంటూ ఉత్సాహంగా గడిపారు.
ఆగస్టు 20 : దేశభక్తిని, జాతీయ స్పూర్తిని ప్రకటించే విధంగా ముగ్గుల పోటీలు
ఆకాశంలో హరివిల్లు.. అందాల రంగవల్లులు
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు నల్గొండ పట్టణం మేకల అభినవ్ స్టేడియం లో ,మున్సిపాలిటీ లలో వేడుకగా రంగవల్లులు కార్యక్రమం జరిగింది.
పదుల సంఖ్యలో మహిళలు తరలివచ్చి మైదానం ను ముగ్గుల తో తీర్చిదిద్దారు.
జాతీయ స్ఫూర్తిని పెంపొందించేలా వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి.
*ఆగస్టు 21:వన మహోత్సవం*
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని నల్గొండ పట్టణం నీల గిరి అర్బన్ పార్క్ లో పట్టణం వనమహోత్సవం కార్యక్రమం పండుగ వాతావరణం లో నిర్వహించారు.
కార్యక్రమానికి శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ సైది రెడ్డి లు ముఖ్యఅతిథిగా హాజరై స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు.నందన వనం అర్బన్ పార్క్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ మొక్కలు నాటారు
వనమహోత్సవం కార్యక్రమం ద్వారా ఈ రోజు జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో
అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో జిల్లాలో లక్షలకు పైగా మొక్కలు నాటారు.
*ఆలోచింపజేసిన గాంధీ చిత్రం*
75 వ స్వతంత్ర భారత వజ్రో త్సవాల లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రపై రూపొందించిన *గాంధీ* చిత్రాన్ని జిల్లాలో 16 థియేటర్ లలో ఈ నెల 9,10,11 తేదీలలో అలాగే 16 నుండి 21 వరకు రెండు విడతలుగా ప్రదర్శించారు. 6 వ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.83,541 మంది విద్యార్థినీ,విద్యార్థులు ఈ చిత్రాన్ని వీక్షించారు.
స్వతంత్ర పోరాట సంగ్రామం దృశ్యాలు స్వతంత్ర సమరయోధుల త్యాగాలను తెలియజేసేలా సాగిన ఈ చిత్రం విద్యార్థులను అమితంగా ఆకట్టుకుంది.
*స్వతంత్ర భారత వజ్రోత్సవ వేళ…*
*విద్యుత్ దీపాలకాంతుల జిగేలులు*
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేల జిల్లా కేంద్రం నల్గొండ, సహా మున్సిపాలిటీ లు,మండలం లలో ప్రభుత్వ కార్యాలయాలు గ్రామాలు విద్యుత్ దీప కాంతులతో ప్రజలకు కనువిందు చేశాయి. ప్రధాన కూడలులు విద్యుత్ కాంతులతో జిగేలుమన్నాయి.
జిల్లాలో వేడుకలు ఆ దేశభక్తిని పెంపొందించేలా న భూతో న భవిష్యత్తు అన్నట్లు జరిగాయి. రెవెన్యూ, పోలీస్, మున్సిపాలిటీ లు, విద్యాశాఖ, యువజన సర్వీసులు క్రీడా శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయితీ రాజ్ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ లు క్రియాశాలక పాత్ర పోషించాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేడుకలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం జరిగేలా జిల్లా అదనపు కలెక్టర్ లు రాహుల్ శర్మ,భాస్కర్ రావు లు ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, క్షేత్ర అధికారుల తో సమన్వయం చేశారు.
*జిల్లా కలెక్టర్ అభినందన*
రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ జి. జగదీశ్ రెడ్డి ల మార్గదర్శనం మేరకు ప్రజా ప్రతినిధులు సహకారం,ప్రజల భాగస్వామ్యం తో జిల్లాలో ఈ నెల 9 నుంచి 21 వరకు నిర్వహించిన ‘భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహం’కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు.
ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా, స్వతంత్ర సమరయోధుల త్యాగాలను తెలియజేసేలా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ వజ్రోత్సవ వేడుకల్లో భాగస్వామ్యమైన ప్రజాప్రతినిధులు, అధికారులు ,పౌరులకు ధన్యవాదాలు తెలిపారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా కృషి చేసిన అధికారులకు జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు.