స్వాతంత్ర్య స్ఫూర్తి తో తెలంగాణ రాష్ట్రం లో అభివృద్ధి

:రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి*.
నల్గొండ బ్యూరో. జనం సాక్షి నల్గొండ పట్టణం లో మర్రి గూడ బైపాస్ కూడలి,క్లాక్ టవర్ కూడలి ప్రారంభం, బుద్ధ వనం ఆవిష్కరించిన టవర్ మంత్రి. క్లాక్ టవర్ కూడలి లో 100 అడుగుల ఎత్తున జాతీయ పతాకం ఆవిష్కరణ, ఎన్.జి.కళాశాల నుండి సుభాష్ చంద్ర బోస్ విగ్రహం వరకు 1500 మీటర్ల పొడవు ఉన్న జాతీయ పతాకం ప్రదర్శన,భారీ సంఖ్య లో హాజరైన విద్యార్థులు,ప్రజలు. స్వాతంత్ర్య స్ఫూర్తి తో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం లో ప్రజల అవసరాల కనుగుణంగా వారు కోరుకున్న విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం లో పరిపాలన సాగిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగ దీష్ రెడ్డి అన్నారు.ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రం లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం లో పాల్గొన్నారు .నల్గొండ పట్టణ అభివృద్ధి సుందరీకరణ లో బాగంగా ఏర్పాటు చేసిన మర్రి గూడ బైపాస్ కూడలి ప్రారంభం,అక్కడే ఏర్పాటు చేసిన బుద్ధవనం,బుద్ధుని విగ్రహాన్ని మంత్రి శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తో కలిసి ఆవిష్కరించారు.తర్వాత క్లాక్ టవర్ కూడలి ప్రారంభించి 100 అడుగుల ఎత్తున ప్రజలు,విద్యార్థులు సమక్షం లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో మంత్రి,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి,ఎస్.పి.రెమా రాజేశ్వరి, మున్సిపల్ చైర్మన్ సైది రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బాగొని రమేష్,పలువురు కౌన్సిలర్ లు పాల్గొన్నారు.ఎన్.జి.కళాశాల నుండి సుభాష్ చంద్ర బోస్ విగ్రహం వరకు 1500 మీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని విద్యార్థులు ప్రదర్శించి క్లాక్ టవర్ చేరుకున్నారు అక్కడ ప్రజల ను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ బిన్న రాష్ట్రాలు సంస్కృతులు ఉన్న దేశం లో ప్రజలను ఏకం చేసి పరాయి పాలన బ్రిటిష్ వారి నుండి ఎన్నో అవమానాలు ఎదురుకొని అహింసా పద్దతి లో దేశానికి మహాత్మా గాంధీ స్వాతంత్య్రం సాధించారని,గాంధీ నాయకత్వం ప్రతి పల్లె కోరుకున్న విధంగా రాష్ట్ర ప్రజలు ముఖ్య మంత్రి కె.చంద్ర శేఖర్ రావు పరిపాలన ను ప్రతి గ్రామం లో ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు.ముఖ్యమంత్రి నల్గొండ వస్తానని ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చిన విధంగా నల్గొండ లో పర్యటించి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె టి.అర్ ను నల్గొండ కు పంపించారని, కె.టి.అర్.పట్టణం లో పాద యాత్ర చేసి ప్రజలు సమస్యలు తెలుసుకున్నారని అన్నారు.ప్రజలు కోరుకున్న విధంగా నల్గొండ పట్టణ అభివృద్ధి 4 నెలలుగా అద్భుతంగా జరుగుతుందని అన్నారు నల్గొండ పట్టణం లో కళాభారతి కి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి శంఖు స్థాపన చేస్తారని,పట్టణ అభివృద్ధి లో,రహదారుల వెడల్పు లో ప్రజల సహకారం గుర్తు చేస్తూ ధన్య వాదాలు తెలిపారు. శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ 75 సంవత్సరాల భారత స్వాతంత్య్రం గురించి బావి తరాలకు తెలియాలని స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఆగస్ట్ 8 నుండి 22 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ముఖ్య మంత్రి మాట ఇచ్చిన విధంగా నల్గొండ పట్టణం అభివృద్ధి శర వేగంగా జరుగు తోందనీ అన్నారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,ప్రజా రోగ్య శాఖ ఎస్. ఈ కందు కూరి వెంకటేశ్వర్లు,మున్సిపల్ కమిషనర్ కె.వి.రమణా చారి,ప్రజారోగ్య శాఖ ఈ ఈ సత్యనారాయణ,డి. ఈ. ఓ బిక్షపతి,అధికారులు,స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

తాజావార్తలు