స్వాతంత్ర్య స్వర్ణ ఉత్సవాలలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి

 

వేములవాడ రూరల్, బోయినపల్లి మండలాల ప్రజలకు, విద్యార్థి విద్యార్థునులకు, ప్రజాప్రతినిధులకు, అన్నీ స్వచ్చంద సంస్థల నిర్వాహకులకు, యూత్ ఆర్గనైజషన్ వారికీ మరియు వాణిజ్జ్య వ్యాపార యజమానులకు వేములవాడ రూరల్ సి ఐ బన్సీలాల్ శనివారం సాయంత్రం పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 75 వ స్వాతంత్ర స్వర్ణ ఉత్సవాలలో భాగంగా 16 వ తేదీ మంగళవారం రోజున ఉదయం 11-30 గం లకు రెండు మండలాల్లోని అన్నీ గ్రామాల ప్రజలందరూ స్వచ్చందంగా బయటకు వచ్చి జాతీయగీతం శ్రద్దగా పాడవలెను. జాతీయగీతం ఆలపించబడే సమయంలో దుకాణదారులు తమ షాప్ ల నుండి బయటకు రావలెను. అదేవిదంగా వాహనాలలో ప్రయాణించేవారు, నడిచి వెళ్లేవారు అందరూ కూడా ఆశ్రద్ద చేయకుండా తమ వాహనాలు దిగి శ్రద్దగా జాతీయగీతం ఆలపించవలెను. ప్రజలందరూ మనకు దేశ స్వాతంత్ర్యం సాధించిపెట్టిన ఎందరో మహానుభావులు త్యాగలను గుర్తు చేసుకుంటూ వారిని గౌవిస్తూ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్బంగా భారత స్వర్నోత్సవాలాలో భాగంగా అందరూ స్వంచందంగా పాల్గొని శ్రద్దగా జాతీయగీతం ఆలపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు