-స్వాతంత్ర స్ఫూర్తిని ప్రతిబింబించేలా రంగోలి పోటీలు.

విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన అదనపు కలెక్టర్ మనుచౌదరి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు20(జనంసాక్షి):

భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను ప్రతిబింబించేలా మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొని ముగ్గులు వేశారు.
శనివారం 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలు పురస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ, మున్సిపల్,వివిధ శాఖల మహిళ ఉద్యోగులతో రంగోలి పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ మనూచౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.నాగర్ కర్నూల్ మున్సిపల్ మహిళా ఉద్యోగులు వేసిన ముగ్గుకు మొదటి బహుమతి, మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళ ఉద్యోగస్తులు వేసిన ముగ్గుకు రెండవ బహుమతి, డిఆర్డిఏ మహిళా సంఘాలు వేసిన మూడోవ బహుమతికి ఎంపికయ్యాయి.ఈ రంగవల్లి లో మహిళా అధికారులు జడ్జీలు గా వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు.ఎంపికైన మహిళా ఉద్యోగులకు అదనపు కలెక్టర్ బహుమతు లను ప్రధానం చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మనుచౌదరి మాట్లాడు తూ..75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా నిర్వహించిన రంగోలి పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వతంత్ర స్ఫూర్తిని కలిగించేలా ముగ్గులు వేశారని వారందరికి అభినందనలు తెలిపారు.ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు సందేశం తో కూడిన ముగ్గు వేయడం జరిగిందని తెలిపారు.
అదేవిధంగా అనాధ బాలికలు వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు మెమొంటోలు అందజేశారు.
ఆర్థికంగా ఎలాంటి తోడ్పాటు లేనప్పటికీ సేవా భావంతో వృద్ధులకు అనాధ పిల్లలకు అవకాశం కల్పించి తీర్చిదిద్దుతున్న జ్ఞానేశ్వర వాత్సల్య మందిరం, జ్ఞానేశ్వర్ బాల్య కళ్యాణమందిర్ నాగర్ కర్నూల్, కొల్లాపూర్ విశ్వశాంతి, బిజినపల్లి ప్రశాంతి నిలయం, అచ్చంపేట ఎస్.ఏ.వి గుప్తా, ప్రజల భాగ్యస్వామ్య సంస్థ కల్వకుర్తి బాల నందం అచ్చంపేట, స్వచ్ఛంద సేవా సంస్థల వారిని అభినందించారు.అనాధాశ్రమంలో చదువుతున్న విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయాలని, వారే దేశ భావి భవిష్యత్ పౌరులని, వారి ఎదుగుదలే మన ఎదుగుదల అన్నారు.సేవా భావంతో పనిచేస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ నర్సింగ్ రావు, సంక్షేమ అధికారిని వెంకటలక్ష్మి, జిల్లా మార్కెటింగ్ అధికారి బాలమణి, అదనపు డిఆర్డిఓ రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబురావు, వివేకానంద స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రామకృష్ణ, డిపిఎం అరుణదేవి, ఎల్ డి ఎం కౌశల్ కిషోర్ పాండే, మెట్మా మేనేజర్ రాజేష్, వివిధ శాఖల మహిళా ఉద్యోగినిలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.