స్విస్‌ అకౌంట్లు బయటపెట్టిన కేజ్రీవాల్‌

లిస్టులో ముఖేష్‌ అంబానీ,అనీల్‌ అంబానీ
న్యూడిల్లీ:  నవంబర్‌ 9,(జనంసాక్షి):   ఇండియా ఎగైనెస్ట్‌ కరప్షన్‌ సభ్యడు అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం మరో బాంబు పేల్చారు.స్విస్‌ బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నయంటూ పలువురి పేర్లు బయటపెట్టాడు. ఆయన ప్రకటించిన లిస్టులో ముఖేష్‌ అంబానీ,అనీల్‌ అంబానీ ,అనూటండన్‌,నరేష్‌ గోయల్‌,డాబర్‌  గ్రూపు తదితరుల పేర్లు ఉన్నాయి.బ్లాక్‌ మనీని పెద్దఎత్తున మన దేశానికి చెందిన పలువురు స్విస్‌ బ్యాంకులకు తరిలిస్తున్నారని విమర్శించారు. కేద్రం వద్ద నల్ల కుబేరుల చిట్టా ఉందని,కానీ వారి పేర్లు బయట పెట్టేందకు మాత్రం ముందుకు రావడం  లేదన్నారు.నల్లధనం వెనక్కి తెచ్చేందుకు కేద్రం ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదని ఆరోపించారు.ఏఐసిసి ప్రదాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ జట్టులోని అనుటాండన్‌కు స్విస్‌ బ్యాంక్‌లో అకౌంట్‌ ఉందన్నారు.ముఖేష్‌,అనీల్‌ అంబానీలు 2006లో చెరో వంద కోట్లు రూపాయలు స్విస్‌  బ్యాంకుల్లో వేశారన్నారు. స్విస్‌ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న వారి చిట్టా తన వద్ద ఉందని,ఈ లిస్ట్‌ను  తనకు ఓ కాంగ్రెస్‌ నేతనే ఇచ్చారన్నారు.ఏఐసిసి అద్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా పైన దాడి కొనసాగించాలని స్వయంగా ఓ కేంద్రమంత్రే తనకు చెప్పారన్నారు. స్విస్‌ బ్యాంక్‌లో అకౌంట్‌ ఉన్న అనుటాండన్‌ రాహుల్‌ టీమ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు.బ్లాక్‌ మనీని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. స్విస్‌ బ్యాంక్‌లో రిలయన్స్‌ది రూ.500 కోట్లు,సురేష్‌ గోయల్‌వి రూ.80 కోట్లు,మోటెక్‌ సాప్టువేర్‌వి రూ.2100 కోట్లు,అనూ టాండన్‌వి రూ.125 కోట్లు,ఉన్నాయన్నారు.స్విస్‌ బ్యాంక్‌లో 700 మంది భారతీయులకు ఎకౌంట్లు ఉన్నాయని ఆరోపించారు.జెనీవాలో హెచ్‌ఎస్‌బిసిలో ఖాతాలు ఉన్నాయన్నారు.హెచ్‌ఎస్‌బిసిలో ఆరువేల బారత భ్లాక్‌ మనీ ఉందన్నారు.