స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ నుంచి

సైనా నిష్క్రమణ

బాసెల్‌, మార్చి 17 (జనంసాక్షి) :

స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ నుంచి మహిళల సింగిల్‌ నుంచి సైనా నెహ్వాల్‌ నిష్క్రమించారు. సెమీ ఫైనల్‌లో సైనాపై చైనా క్రీడాకారిణి సిజియన్‌ వాంగ్‌ విజయం సాధించింది. వాంగ్‌ చేతిలో 21-11, 10-21, 21-9 తేడాతో ఓటమి చెందారు.  శుక్రవారం రాత్రి ఇక్కడ జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సైనా అలవోకగా విజయం సాధించిన విషయం విదితమే. 21-11, 21-12తో ఆరోసీడ్‌ జూయింగ్‌ తాయ్‌ని వరుస గేముల్లో చిత్తు చేసి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆమె ఫైనల్‌కు చేరకుండానే నిష్క్రమించారు.