స్వేచ్ఛాయుత జీవనంతోనే నిజమైన అభివృద్ధి

మానవులకు స్వేచ్ఛాయిత జీవనంతోనే నిజమైన అభివృద్ధి జరుగుతుందని ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మట్టపల్లి రవీందర్ అన్నారు. శనివారం కళాశాలలో అంతర్జాతీయ మానవ హక్కులు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మానవ హక్కుల ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. హక్కులు అందుబాటులోకి వచ్చినప్పుడే నిజమైన స్వేచ్ఛ సమానత్వం స్వాతంత్ర్యం లభిస్తుందన్నారు. హక్కులు అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. అనంతరం సిరి డెంటల్ కేర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మల్లేశ్వరి, అధ్యాపకులు సిహెచ్ సత్యనారాయణ, నాగేశ్వరరావు, రజిని కుమార్, రమేష్, శిరీష, శ్రావణి, సోనీ, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.