హంపి పీఠాధిపతులు ఆధ్వర్యంలో మహాసంస్థాన పూజలు

 ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి విచ్చేసిన కర్ణాటకలోని శ్రీహంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం పీఠాధిపతులు విద్యారణ్య భారతి తీర్థ స్వామీజీ వేద పాఠశాలలో సంస్థాన పూజలు గురువారం నిర్వహించారు.దేవాలయ చైర్మన్ ప్రహ్లాద రావు,ఈవో సత్య చంద్రారెడ్డి, భక్తులు స్వామీజీ ఆశీస్సులు పొందారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ హంపి పుణ్యక్షేత్రం ప్రాచీనమైనదని ఇక్కడ శ్రీ విరూపాక్షుడు పంపా దేవి భువనేశ్వరి మాత కొలువై ఉన్నారని తెలిపారు.ఇంతేగాక బ్రహ్మ విష్ణు మహేశ్వరుల క్షేత్రంగా పిలువబడుతున్న హంపి శ్రీకృష్ణదేవరాయలు పాలనలో వెలిగిపోయిందని అన్నారు.ప్రస్తుతం దేశ పర్యటనలో భాగంగా మల్దకల్ పుణ్యక్షేత్రానికి వచ్చినట్లు స్వామీజీ తెలిపారు.విఠల దేవాలయం, ఏకశిలా రథం, ఇతర దేవాలయాలు ఉన్నాయని తెలిపారు.ఇట్టి చారిత్రక పౌరాణిక దేవాలయం దర్శించ తగినదని స్వామి తెలిపారు.ఈ కార్యక్రమంలో దేరేంద్ర దాస్, మధుసూదనాచారి,రమేష్, రవి,అరవిందరావు,చంద్రశేఖర రావు,మధుసూదన్ రెడ్డి, వెంకోబారావు తదితరులు పాల్గొన్నారు.