హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగానికి ప్రతీక మొహర్రం

ఎంఐఎం ఆధ్వర్యంలో షర్బత్ పంపిణీ

* మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
మొహర్రం 10వ తేదీ యౌమే ఆశురా సందర్భంగా నగరంలోని పాత బజార్, జామా మసీదు ప్రాంగణంలో ఎంఐఎం పార్టీ కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో పాలతో కూడిన షర్బత్ను పంపిణీ చేశారు. ఈకార్యక్రమానికి రాష్ట్ర బీసీ, పౌరసరాఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ మాట్లాడుతూ హజరత్ ఇమామ్ హుస్సేన్ వీరోచిత త్యాగానికి ప్రతీకగా మొహర్రం అన్నారు. త్యాగ ధనుల వీరోచిత పోరాటానికి గుర్తింపుగా ప్రతియేటా పవిత్ర మొహర్రం నెల 10వ తేదీనీ స్మృతి దినంగా జరుపుకుంటారన్నారు. ఎంఐఎం జిల్లా ఇంచార్జి గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ పవిత్ర పుణ్య ఫలాలను పొందడానికి ప్రతి ఏటా 10వ మొహర్రం రోజున సందర్భంగా షర్బత్ పంపిణీ కార్యక్రమాన్ని ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, సయ్యద్ అంజడ్ అలీ ,చల్ల హరిశంకర్ ఎసిపి తులా శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ మేయర్ మహమ్మద్ అబ్బాస్ సమీ, ఎంఐఎం నాయకులు సయ్యద్ బర్కత్ అలీ, అజర్ దబీర్, ఖమరుద్దీన్ కాజమలి ఖాన్ , తదితరులు పాల్గొన్నారు.